పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా డ్యూటీ చేస్తూ అమరులైన వారిని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. శాంతి భద్రతల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి చనిపోయిన వారికి సీఎం కేసీఆర్ గురువారం నివాళి అర్పించారు. అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణ కోసం నిబద్ధతతో పని చేయాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. అమరులైన పోలీసుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని కేసీఆర్ గుర్తు చేశారు.
మరోవైపు, గోశామహల్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని ప్రసంగించారు. విధి నిర్వహణ ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ఘన నివాళి అర్పిస్తున్నానని ఆయన అన్నారు. దేశ భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలను మరచిపోలేమని.. ఎంతో మంది పోలీసులు తమ ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులు అయ్యారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. కరోనా క్లిష్టమైన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 62 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇందులో 10 మంది హోమ్ గార్డులు చనిపోయారని వివరించారు.
Also Read: పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన బోనాలు, రంజాన్ పండుగలు ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు. సీసీటీవీలు ఏర్పాటు చేసి నేరాలకు తగ్గించే కార్యక్రమం చేపట్టారని చెప్పారు. నూతన పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేసామని తెలిపారు. మహిళల భద్రతకు భరోసా సెంటర్లను ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నామని అన్నారు. గడిచిన ఏడేళ్ళలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చేసిందని చెప్పారు.
Also Read: ఆ విషయంలో కేసీఆర్‌ను మెచ్చుకున్న చంద్రబాబు.. ఏం చేస్తున్నారని ఏపీ సీఎంపై ధ్వజం
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళి అర్పించారు. అక్టోబర్ 21, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరుల సేవలను మంత్రి స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు వదిలిన పోలీసుల సేవలను ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు అంకితం కావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.
Also Read: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి