ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ చేరుకోనున్నారు. సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ట్రైన్‌ను కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వస్తూ వస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. 






ప్రధాని పర్యటనకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. ఈ సభా వేదికపై ఎప్పుడూ చూడని ఓ సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంటోంది. వేదికపై సీఎం కేసీఆర్‌తోపాటు రేవంంత్‌రెడ్డికి కూడా కుర్చీ వేశారు.  అధికారిక పర్యటన కావడంతో ప్రోటోకాల్‌ ప్రకారం వేశారా లేకుంటే రాజకీయంగా విమర్శలు చేయడానిక వేశారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. సీఎం కేసీఆర్‌తో పాటుగా మంత్రులు మహమూద్‌ అలీ, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్‌ రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి పేరుతో కుర్చీలు దర్శనమిస్తున్నాయి. 


బేగంపేట ఎయిర్‌పోర్టులో కాసేపటి క్రితం ప్రధానమంత్రి మోదీ ఫ్లైట్ దిగారు. మళ్లీ 1.30కి తిరిగి వెళ్లనున్నారు. రెండు గంటల పర్యటన కోసం ప్రధాని తిరిగే ప్రాంతాలు, మార్గాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఐదు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన వేళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట విమానాశ్రయం–సికింద్రాబాద్‌ స్టేషన్‌–పరేడ్‌ గ్రౌండ్స్‌ మధ్య మార్గాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. జేఈఈ మెయిన్స్, ఎస్సై అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.