సైబర్ క్రైమ్, ఆహార కల్తీ కేసులు, మానవ అక్రమ రవాణాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. వీటితో పాటు మతపరమైన కేసులలో హైదరాబాద్ మరోసారి నగరాల జాబితాలో తొలి స్థానంలో ఉంది. వరుసగా మూడో ఏడాది ఐపీసీ సెక్షన్ 153ఏ కేసులు అధికంగా హైదరాబాద్ లో నమోదయ్యాయని జాతీయ నేర గణాంక సంస్థ (NCRB) ఆదివారం వెల్లడించింది. దేశంలో నేరాలు 2021 నివేదికను ఎన్‌సీఆర్‌బీ విడుదల చేయగా.. మొత్తం 19 మెట్రోపాలిటన్ నగరాలలో కమ్యూనల్ కేసులలో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది.


2021లో హైదరాబాద్‌లో అత్యధికంగా ఐపీసీ సెక్షన్ 153ఏ సెక్షన్ కింద 28 కేసులు నమోదయ్యాయి. 17 కేసులతో ఢిల్లీ, 14 కేసులతో కొయంబత్తూర్ ఆ టాప్ 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఓవరాల్‌గా 19 మెట్రో నగరాలలో 121 కేసులు నమోదు కాగా, కేవలం హైదరాబాద్ లోనే 23 శాతం కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల ప్రకారం చూస్తే 88 కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. తమిళనాడులో 91 కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ 2021 నివేదికలో వెల్లడైంది. 


కిందటి ఏడాదితో పోల్చితే తగ్గిన కేసులు.. 
2020 ఏడాదితో పోల్చితే నగరంలో కేసులు 44 శాతం తగ్గాయి. విధ్వేష పూరిత ప్రసంగాలు, శత్రుత్వంతో కూడిన ప్రసంగాలు అధికంగా ఉండగా.. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే మతతత్వ, కుల వివాదాలు, గొడవలు  హైదరాబాద్‌లో తక్కువగా జరిగాయి. 


తెలంగాణలో 2021లో 562 అల్లర్ల కేసులు నమోదు కాగా, గరిష్టంగా 135 కేసులు భూ వివాదాల కారణంగా నమోదయ్యాయి. రాజకీయ కేసులు 53 ఉండగా, పూర్తిగా మత సంబంధ కేసులు 31, నగదు వివాదం కేసులు 16, కుటుంబ తగాదాలు 22, ప్రత్యర్థి వర్గాల గొడవలపై 50 కేసులు, నిరసనల కేసులు 7 నమోదయ్యాయి. పోలీసులు, పోలీస్ సిబ్బందిపై 31 కేసులు, ఇతరత్రా కారణాలతో మరో 235 కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 


తెలంగాణలో 2020లో 1 లక్షా 47 వేల 504 (1,47,504) నేర కేసులు నమోదు కాగా,‌ కాగా.. 2021లో మరిన్ని పెరిగి 1,58,809 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 10,171 మంది ఆత్మహత్య చేసుకోగా.. కుటుంబ కలహాలు, అనారోగ్యంతో 4,464 మంది సూసైడ్‌‌‌‌ చేసుకున్నారు. వీరిలో అధికంగా 45 నుంచి 60 ఏళ్ల వారే ఉన్నారు.


సైబర్ నేరాలల్లో టాప్ 
ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్ నేరాలు కూడా తెలంగాణలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి. మొత్తం 8693 కేసులు నమోదు అవ్వగా.. 2019లో 11,465, 2020లో 12,985, 2021లో 20,759కి చేరుకున్నాయి. ఈ తీరు చూస్తే రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అలాగే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 2021లో దేశ వ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేస్కున్నారు. వీటిలో 4,806 మంది రైతులు, 5,121 మంది కౌలు రైతులు ఉన్నారు. అలాగే 5 వేల 563 మంది రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. 


Also Read: NCRB Report Telangana: సైబర్ క్రైమ్‌లో తెలంగాణ నెంబర్ వన్, ఆహార కల్తీలోనూ అగ్రస్థానం ! 


Also Read: NCRB Report: రాజద్రోహం కేసుల్లో దేశంలోనే ఏపీ టాప్, పెరిగిన క్రైమ్ రేటు - NCRB నివేదిక స్పష్టం