నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన దీక్ష నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్​ది నిరుద్యోగ దీక్ష కాదని.. అవకాశవాద దీక్ష అని లేఖలో విమర్శించారు. ఉద్యోగాలను కల్పించడంతో బీజేపీ విఫలం చెందిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణకు దక్కిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలని నిలదీశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఆఆర్)​ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు వచ్చి ఉంటే ఎన్నో ఉద్యోగాలు వచ్చేవని.. యువతను నమ్మించి నట్టేట ముంచిన చరిత్ర బీజేపీదే అంటూ విమర్శించారు. బీజేపీ హాయాంలోనే గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని మంత్రి అన్నారు. బండి సంజయ్‌కి నిరుద్యోగుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద దీక్ష చేపట్టాలని సవాలు విసిరారు.


Also Read: Money Tips Telugu: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి... 


ముక్కు నేలకు రాసి వివరణ ఇవ్వండి
బీజేపీ కల్పించిన ఉద్యోగాలపై కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉపాధి కల్పనలో టీఆర్ఎస్ నిబద్ధతను ప్రశ్నించే హక్కు కాషాయ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో కొత్తగా వచ్చిన ఉద్యోగాల లెక్కలు చెప్పగలరా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సిన 15 లక్షల ఉద్యోగ ఖాళీలను ఎందుకు పూర్తి చేయలేదో మీకు మీరే ప్రశ్నించుకోవాలని సూచించారు. బండి సంజయ్‌కు నిబద్ధత ఉంటే కేంద్ర వైఫల్యాలపై ఇందిరా పార్కు సాక్షిగా ముక్కు నేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.


దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని చరిత్రలోనే రికార్డు స్థాయికి తీసుకెళ్లి, ఆర్థిక సంక్షోభంతోపాటు, మత సామరస్యాన్ని కూడా బీజేపీ దెబ్బతీస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో 1.3 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగిందని అన్నారు. టీఎస్​ఐ పాస్ విధానం ద్వారా రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, వీటి ద్వారా సుమారు 16 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని మంత్రి కేటీఆర్​ లేఖలో పేర్కొన్నారు. 


Also Read: Hyderabad: పాత పనిమనిషి మెగా ప్లాన్.. దాన్ని అమలు చేసిన కొత్త పనిమనిషి, ఓనర్‌‌కే కుచ్చుటోపీ!


కేంద్రం నుంచి ఏ సాయం అందలేదు: కేటీఆర్
దాదాపు తాము 3 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చామని అన్నారు. ఇన్నోవేషన్, అంకుర పరిశ్రమల ఏర్పాటు ద్వారా లక్షల ఉద్యోగాలు సృష్టిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు, కాకతీయ మెగా టెక్స్​టైల్స్ పార్క్ వంటి అనేక ప్రాజెక్టులు తీసుకు వచ్చినా కేంద్రం నుంచి ఒక్క రూపాయి అదనపు సాయం అందలేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి హామీ ఇచ్చిన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేనదని గుర్తు చేశారు.














Also Read: Teenmar Mallanna: ఈ ఛానెళ్లలో పని చేసేవాళ్లు జర్నలిస్టులే కాదు.. అల్లం నారాయణ సంచలన వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి