హైదరాబాద్‌ మెట్రో రైల్లో మంత్రి కేటీఆర్‌ (KTR in Metro Rail) సందడి చేశారు. సామాన్య ప్రయాణికుడిలా నిలబడి ప్రయాణించారు. మంత్రి తమ మధ్యలోకి రావడంతో చుట్టుపక్కల వారు అందరూ అవాక్కయ్యారు. శుక్రవారం (నవంబరు 24) ఉదయం మంత్రి కేటీఆర్ రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బేగంపేట మెట్రో స్టేషన్ వరకూ ప్రయాణించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) లో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో జరిగిన స్థిరాస్తి సదస్సు శుక్రవారం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి నేరుగా రాయదుర్గం మెట్రో స్టేషన్ కి వచ్చి రైలు ఎక్కారు. అలా రాయదుర్గం నుంచి బేగంపేట వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు మెట్రో ప్రయాణికులు ఆసక్తి చూపారు.


మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


మంత్రి కేటీఆర్ తన 20 నిమిషాల ప్రయాణంలో పలువురితో ముచ్చటించారు. ఇంటర్మీడియట్ చదువుతూ వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినితోపాటు, ఇప్పటికే ఎంబీబీఎస్ కోర్స్ చదువుతున్న మరో విద్యార్థి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. జర్మనీలో బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న మరో ప్రయాణికుడు కేటీఆర్ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా జర్మనీతో సమానంగా బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరు పైన కేటీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న తీరు తనకు ఎంతో గర్వాన్ని ఇస్తుందని తెలిపారు.


జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మెట్రోలో ఎక్కిన పలువురు విద్యార్థినిలు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థినుల బృందం హైదరాబాద్ నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మీకు ఈ మెడికల్ కోడింగ్ శిక్షణకు సంబంధించిన ఆలోచన ఏ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ వారితో సంభాషించారు. మెడికల్ కోడింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు ఉన్న విషయాన్ని తమ స్నేహితులతో తెలుసుకొని, ప్రస్తుతం తమ శిక్షణ పూర్తి చేసుకునన్నామని తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా తక్కువ మంది దృష్టి సారించే విభిన్నమైన మెడికల్ కోడింగ్ రంగంలో పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కేటీఆర్ ఆల్ ద బెస్ట్ తెలిపారు. 


మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


వీరితోపాటు పలువురు మహిళలు, వృద్ధులతో కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేరళకు చెందిన ఒక టూరిస్ట్ హైదరాబాద్ నగరంలో మూడు రోజులపాటు పర్యటిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరం నేను ఇంటర్నెట్ లో తెలుసుకున్న దానికన్నా గొప్పగా ఉన్నదని, ముఖ్యంగా నూతనంగా వచ్చిన అనేక కట్టడాలు, రోడ్లను చూస్తే ఒక విదేశీ నగరంలో పర్యటిస్తున్నట్లు అనిపించిందని ఆయన ప్రశంసించారు. నేను ఎవరో తెలుసా అని ఆ టూరిస్ట్ ని మంత్రి కేటీఆర్ అడిగినప్పుడు, మీరు ఎందుకు తెలవదు మాకు, ముఖ్యంగా తెలంగాణకు కిటెక్స్ పరిశ్రమ వచ్చినప్పుడు మీ గురించి విస్తృతమైన చర్చ మా రాష్ట్రంలో జరిగిందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.


ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply