తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నడుంబిగించింది. ధరణిలో అవకతవకలు, రెవెన్యూ శాఖలో అక్రమాలు, రిజిస్ట్రేషన్‌శాఖలో లొసుగులతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన రేవంత్ (Revanth Reddy) ప్రభుత్వం...పూర్తిస్థాయిలో రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా సేవలు అందించేలా వ్యవస్థను పటిష్టం చేయడానికి దేశంలోనే అత్యుత్తమ విధానాలు పరిశీలించనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు..


రెవెన్యూ వ్యవస్థ నాశనం


గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponuleti Srinivasa Reddy) ఆరోపించారు. చట్టంలో లొసుగులు ఆసరాగా చేసుకుని కేసీఆర్ కుటుంబంతోపాటు బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ప్రభుత్వ భూములు కొల్లగొట్టారన్నారు. తమ అనుయాయులకు భూములు కట్టబెట్టేందుకే ధరణి ప్రోగ్రాం తీసుకొచ్చారని ఆరోపించారు. ధరణి మొత్తం తప్పుల తడకగా ఉందన్న శ్రీనివాసరెడ్డి...వ్యవస్థలను మూలాల నుంచి ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ(Revenue) వ్యవస్థలో చేయి తడపందే పనులు కావన్న అపవాదు తొలగించేందుకు, పారదర్శకంగా సేవలు అందించేందుకు అత్యుత్తమ విధానాలు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. పేద రైతుల భూమికి భరోసా కల్పిస్తామన్న పొంగులేటి....ఇందుకోసం దేశంలోనే అత్యుత్తమ విధానాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో దోచుకున్న భూముల వివరాలు బయటకు తీసుకున్నామని...అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.


పొంగులేటితో కేరళ మంత్రి భేటీ


సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కేరళ(Kerala) మంత్రి కె.రాజన్ సహా అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేరళలో అమలవుతున్న హౌసింగ్‌ స్కీమ్‌తో పాటూ రెవెన్యూ విభాగం పనితీరు, వాటి వివరాలను మంత్రి పొంగులేటి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన సేవలు అందించడానికి అక్కడి ప్రభుత్వం అవలంభిస్తున్న ఆధునిక పద్ధతులను గురించి కనుక్కున్నారు. గతంలో వరదలు వచ్చిన సమయంలో అక్కడి రెవెన్యూ వ్యవస్థ సకాలంలో స్పందించి వేలాది మందిని కాపాడంతో దేశవ్యాప్తంగా మంచి పేరు లభించింది. ఎక్కువగ కొండలు, అడవులతో ఉన్నకేరళలో గృహనిర్మాణానికి తీసుకుంటున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. వరదలను తట్టుకునేలా మునక ప్రాంతాల్లోనూ అతి తక్కువ ఖర్చుతో చేపడుతున్న ఇళ్ల నిర్మాణం, డిజైన్లు గురించి వాకబు చేశారు. రైతుల నుంచి ప్రభుత్వ భూములు సేకరణలోనూ, పరిహారం చెల్లింపుల్లోనూ కేరళ ప్రభుత్వ విధానం ఉత్తమమైనదిగా పేరుంది. 


దీనిపైనా అధికారులు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సాయం కావాలన్న తమ అధికార యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేరళ మంత్రి రాజన్ హామీ ఇచ్చారు.   వరదల సమయంలో అక్కడి రెెవెన్యూ యంత్ర రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైనదని, అదే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విభాగం సమర్ధవంతంగా పనిచేసినప్పుడే ప్రజలకు ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు, అకాంక్షలు నేరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయన్నారు. ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండే రెవెన్యూశాఖ పనితీరుతోనే ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తుందని పొంగులేటి అన్నారు.