Karnataka Results Effect in Telangana BJP | దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక ఇప్పుడు కమలనాథుల చేజారిపోయింది. కర్ణాటక పోయింది సరే..! కానీ, ఈ ఓటమి ఎఫెక్ట్... పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం, అందులోనూ ఈ ఏడాదే ఎన్నికలు జరగనుండటంతో కర్ణాటక ఎన్నికల ఫలితం ఇక్కడ ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. దక్షిణాదిలో కర్ణాటక తరువాత బీజేపీ బలంగా ఉంది తెలంగాణలోనే.. కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చి.. మిషన్ తెలంగాణ అమలు చేద్దామనుకున్న దిల్లీ పెద్దలకు ఈ రిజల్ట్స్ చేదు విషయమే అని చెప్పుకోవచ్చు.. ఓవరాల్ గా కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎఫెక్ట్ వల్ల తెలంగాణ బీజేపీకి వచ్చే కొత్త సమస్య ఏంటన్న వివరాలపై ఓ లుక్కేయండి.
1: క్యాడర్ లో నిరుత్సాహం..!
కర్ణాటకలో విజయం సాధించి ఉంటే.. ఇక నెక్ట్ టార్గెట్ తెలంగాణే అని బీజేపీ ప్రొజెక్ట్ చేసుకునే వాళ్లు. తెలంగాణలోని కార్యక్తరలు, లీడర్లు కూడా చాలా బలంగా పని చేసేవారు. కానీ, ఇప్పుడా అవకాశం లేదు. ఎంతో కొంత సందిగ్ధత నెలకొంటుంది.
2: డైలామాలో ఆపరేషన్ కమలం
బీఆర్ఎస్ (BRS) కు దీటైన ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ చెప్పుకుంటోంది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. 119 సీట్లలో పోటీ ఏమోగానీ, పట్టుమని 70 సీట్లలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేదు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కమలంతో ఇతర పార్టీలోని పెద్ద నేతలను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, కర్ణాటక ఫలితాలో బీజేపీ లోకి రావాలనుకునే లీడర్లు కూడా వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. బీజేపీలో రావడానికి సిద్ధంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావులు కూడా పునరాలోచించే అవకాశం ఉంది.
ABP News LIVE
https://www.youtube.com/live/nyd-xznCpJc?feature=share
Karnataka Results
3: మతం కార్డు పని చేయదా..?
కర్ణాటకలోనూ బీజేపీ మతం కార్డు పనిచేయలేదు. ఇక తెలంగాణలోనూ పని చేస్తుందన్నది అనుమానమే. ఎందుకంటే.. ఈ రాష్ట్రంలో కులం, మతం ఆధారంగా ఓట్లు పడినట్లు చరిత్రలో లేదు. ప్రాంతీయతత్వాన్ని బలంగా నమ్మె తెలంగాణ ఓటర్లు.. మతం ఆధారంగా ఓట్లు వేస్తారనుకోవడం జోకే అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. సో.. కర్ణాటక ఎఫెక్ట్ తో ఇక్కడ మతం పేరుతో ఓట్లు రాబట్టలేమో అన్న సందిగ్ధత బీజేపీలో నెలకొంటుంది.
4: కాంగ్రెస్ పుంజుకుంటే.. బీజేపీ కష్టమే..!
బీఆర్ఎస్ తరువాత రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్. కానీ, అందులోని లీడర్లే గ్రూప్ రాజకీయాలతో కొట్లాడుతున్నారు కానీ క్యాడర్ అలాగే ఉంది. కర్ణాటక ఎన్నికల్లో డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు కలిసి పని చేస్తే.. విజయం వరించింది. సో.. అదే ఫార్ములాతో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కలిసికట్టుగా ఎన్నికలకు సిద్ధమైతే.. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే బలమైన పార్టీగా మారుతుంది. రాహుల్ గాంధీ కూడా ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చు. క్యాడర్ లో జోష్ రావొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే జనాలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు గుర్తిస్తే.. బీజేపీ అధికారంలోకి రావడం ఏమో గానీ.. సెకండ్ ప్లేస్ కూడా మిస్ అయ్యే ప్రమాదముంది.
ఇలా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీపై గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరీ.. ఈ చేదు ఫలితాన్ని దిగమింగి.. దిల్లీ పెద్దలు, తెలంగాణ బీజేపీ నేతలు ఎలాంటి ప్లాన్స్ తో ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Karnataka + UP Nikay Results
Key Candidates Karnataka
Key Candidates Karnataka+UP Nikay