Space Balloon Flight Found At Vikarabad: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలి గుండ్ల ఏలియన్స్ వచ్చారంటూ  ఓ వార్త హల్ చల్ చేసింది. అది ఇది నిజంగా యూఎఫ్ వో నా.. నిజంగా ఏలియన్స్ వచ్చారా.. ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందా.. అసలు నిజమేంటీ నిగ్గు తేల్చేందుకే ఏబీపీ దేశం ఆ చిన్న చిన్న డీటైల్స్ తో రీసెర్చ్ చేసి వివరాలు సేకరించింది. 


పంటపొలాల్లో పడిపోయినట్లు ఇంత పెద్ద స్పేస్ షిప్ తరహా ఆకారం... దీని చుట్టూ పడిపోయి ఉన్న ప్యారా చూట్లు.. ఇదంతా చూసి నిజంగానే ఏలియన్లు వచ్చారనుకుని ప్రజలు కంగారు పడిపోయారు. కొంతమంది గ్రామస్తులు మాత్రం నేరుగా ఆబ్జెక్ వరకూ వెళ్లి అందులో ఎవరున్నా ఉన్నారేమో కాపాడతామని అడిగారు. ఆటైం లోనే కొంత మంది అక్కడి గ్రామస్తులు తీసిన వీడియోలు ఇవి. ఏవో కొన్ని అక్షరాలు ఇంగ్లీషులానే తిరగబడిపోయి కనిపించాయి. ఆ పేరుతో గూగుల్ సెర్చ్ చేస్తే తేలింది అది హాలో స్పేస్ వాళ్ల స్పేస్ క్యాప్యూల్. 


బుధవారం (డిసెంబర్ 7న) ఉదయం కూడా హైదరాబాద్ లో ఇలానే ఏలియన్లు, యూఎఫ్ వోలు అంటూ పుకార్లు చెలరేగాయి. గాల్లో చాలా సేపు కనిపిస్తూ ఉన్న వింత వస్తువును చూసి చాలా మంది ఏదో జరుగుతోందని భయపడ్డారు. అయితే అవి వెదర్ బెలూన్లు అని వాతావరణ పరిశోధనల కోసం నేషనల్ బెలూన్ ఫెసిలిటీ వాళ్లు వాటిని ప్రయోగించారని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలిపారు. అవి వెయ్యి కిలోల బరువు వరకూ ఉండొచ్చని తెలిపారు. ట్విట్టర్ లో సినీ సెలబ్రెటీలు డైరెక్టర్ క్రిష్, బ్రహ్మాజీ లాంటి వాళ్ల సందేహాలను ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తీర్చింది. కానీ వికారాబాద్ లో కనిపించింది ఇది కాదు. ఎందుకంటే అది పూర్తిగా వేరేలా ఉంది. ఓ పెద్ద క్యాప్య్సూల్ లా. 


  
 సో హాలో స్పేస్ గురించి వార్తలేమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే ఈ హాలో స్పేస్ స్పెయిన్ కు చెందిన ఓ స్పేస్ అడ్వెంచరెస్ సంస్థ. భూమి నుంచి 40 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి అంటే అక్కడ నుంచి ప్రయాణాలు నిర్వహించేలా ఈ స్పేస్ టూరిజం సంస్థ వాహనాలు తయారు చేస్తోంది. పైలెట్ తో సహా మొత్తం 9 మంది కూర్చునేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ఓ ఆరెంజ్ షేప్ లో దీన్ని తయారు చేయటం ద్వారా 360 డిగ్రీస్ వ్యూ ఉండేలా డిజైన్ తయారు చేశారు.


2029 నుంచి కమర్షియల్ ఏరో స్పేస్ టూరిజం చేయించాలని...కోటి రూపాయల టికెట్ తో ఏడాదికి 3వేల మంది ప్రయాణాలు చేసేలా ప్లాన్ చేయాలని భావిస్తోంది. ఏరోస్పేస్ టెస్టింగ్ ఇంటర్నేషనల్ అనే వార్తా సంస్థ దీన్ని ప్రచురించింది. అంతే కాదు నవంబర్ లో  ఓ ప్రోటో టైప్ గా మొత్తం తయారైన ఈ క్యాప్య్సూల్ తన మొదటి టెస్ట్ టెస్ట్ ఫ్లైట్ కోసం ఇండియాకు వెళ్తున్నట్లు కూడా అందులో రాశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR సహకారంతో ఈ టెస్ట్ ఫ్లైట్ డిసెంబర్ లో జరుగుతుందని ఆ వార్తలో రాశారు. 


ఫస్ట్ ఫ్లైట్ లో కేవలం మనుషులు లేకుండా ఒట్టి క్యాప్య్సూల్ ను మాత్రమే ప్రయోగించారు. ఈ క్యాప్స్యూల్ ఎగిరేందుకు వీలయ్యే బెలూన్లు TIFR దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ల ను స్ట్రాటజిక్ పార్టనర్స్ గా చేసుకున్నారు. సో ఆరుగంటల పాటు అలా టెస్ట్ ఫ్లైట్ చేసి వికారాబాద్ జిల్లా పంటపొలాల్లో  ఈ క్యాప్య్సూల్ ల్యాండ్ అయ్యిందన్న మాట. అంతే ఏలియన్స్ లేవు. ఆదిత్య 369 లేదు. అసలు నిజం ఇదే.