ఓ గ్యాంగ్ రేప్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ రియాక్షన్ నెట్టింట్ వైరల్‌గా మారింది. తీర్పుపై ఆమె చేసిన కామెంట్స్‌ను చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇలాంటి తీర్పులు వస్తుంటే... భవిష్యత్‌లో మహిళలు ఆయుధాలు ధరించేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కామెంట్ చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడి శిక్షను రద్దు చేస్తూ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. దీనిపై స్మితాసబర్వాల్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలా న్యాయవ్యవస్థలో నిరాశపూరితమైన తీర్పులు వస్తుంటే.... మహిళలు ఆయుధాలు ధరించేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. చట్టం, న్యాయం రెండు వేర్వేరు వ్యవస్థలు కావాలని కోట్ చేశారు.
బిల్కిస్‌బానో కేసులో కూడా సుప్రీం తీర్పు వచ్చినప్పుడు స్మితా సబర్వాల్ రియాక్ట్ అయ్యారు. గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేయటంపై ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. "ఓ మహిళగా, సివిల్ సర్వెంట్‌గా బిల్కిస్ బానో కేసుకి సంబంధించిన వార్తను చదివాక, పూర్తిగా నమ్మకం కోల్పోయాను. స్వతంత్ర దేశంలో ఉన్నాననే నమ్మకం కలగట్లేదు. ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా, స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే ఆమె హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయింది. జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో" అని ట్వీట్ చేశారు స్మిత సబర్వాల్.
బాధితురాలు గుజరాత్ ప్రభుత్వానికి రాసిన లేఖనూ ట్వీట్‌కు జత చేశారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, తన కుటుంబ భద్రతకు భరోసా ఇవ్వాలని అందులో బాధితురాలు పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన అత్యాచారాలపై స్పందించకుండా, ఎక్కడో గుజరాత్‌లోని ఘటనపై ఇంత ఘాటుగా స్పందించడమేంటి అని కొందరు నేతలు ప్రశ్నించారు.
మా నోరు నొక్కేయాలని చూడకండి: స్మిత
అయితే ఐఏఎస్ అధికారుల భావ ప్రకటనా స్వేచ్ఛపైనా ఆ సందర్భంగా చర్చ జరిగింది. దీనిపైనా స్మితా సబర్వాల్ స్పందించారు. "మా నోరు నొక్కేయాలని చూడటానికి ఇది సరైన సందర్భం కాదు. సివిల్ సర్వెంట్‌గా సర్వీస్‌లో భాగంగా దేశం కోసం ఎన్నో ఏళ్లు సేవలందిస్తాం. అలాంటప్పుడు మాపై ఈ ఆంక్షలెందుకు..?" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ప్రభుత్వాధికారుల "ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్"కు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. "Freedom of Expression to Government Employees" అనే టైటిల్‌తో ఉన్న ఆర్టికల్ స్క్రీన్‌షాట్స్‌ని షేర్ చేశారు.