Ra Ra Rakkamma Song Reel In Metro Station: రీల్స్, షార్ట్స్ ప్రియులు తమ ఫాలోవర్లను ఆకట్టుకునేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. గతంలో రైళ్ల దగ్గర, కొండ కొనలో రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనకు తెలిసిందే. ఇంకొంత మంది సేఫ్ ప్లేస్‌లోనే జనాల్ని ఆకట్టుకునేలా షార్ట్స్, రీల్స్ చేస్తుంటారు. పబ్లిక్ ప్లేస్‌లో జనం మధ్యలో కూడా అస్సలు సిగ్గుపడకుండా స్వచ్ఛగా రీల్స్ చేస్తుంటారు. పాటలకి డాన్సులు వేస్తుంటారు. అలా హైదరాబాద్‌లో ఓ యువతి పబ్లిక్ ప్లేస్ లో రీల్ చేసి ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
యువతి మెట్రో స్టేషన్ లో చేసిన రీల్ ఇక్కడ చూడండి
హైదరాబాద్ నగరంలోని ఓ మెట్రో స్టేషన్‌లో పట్టపగలు యువతి డ్యాన్స్‌తో సందడి చేసింది. ఉదయం వేళ రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చిన ఆమె ఆ ప్లాట్ ఫాంపై జనమంతా ఉండగానే, ‘విక్రాంత్ రోణ’ చిత్రంలోని ‘‘రారా.. రక్కమ్మా.. రారా రక్కమ్మా’’ అనే పాటకి డాన్స్ చేస్తూ రీల్ చేసింది. అది రీల్ అని తెలిసి కూడా జనం ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఆమె స్టెప్పులు వేసి తన ఫ్రెండ్ తో వీడియో తీయించుకుంది. దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. కారిడార్-3లోని దుర్గం చెరువు స్టేషన్‌లో ఆమె డ్యాన్స్ చేసినట్లుగా అర్థం అవుతోంది.
ఈ వీడియోను చూసిన చాలామంది లైక్‌లు, షేర్లు చేశారు. ఆమె గట్స్‌ను కొందరు కామెంట్ల రూపంలో అభినందించారు. ఇంకొందరు మాత్రం పబ్లిక్ ప్లేస్‌లో ఇవేం పనులంటూ కొట్టిపారేశారు. మొత్తానికి ఈ వ్యవహారం మెట్రో అధికారులకు కూడా తెలిసింది. దీంతో ఆ యువతిపై సీరియస్ అయ్యారు. ఆమెను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మెట్రో స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా న్యూసెస్ క్రియేట్ చేయొద్దని ఆమెను హెచ్చరించినట్లు సమాచారం.
యువతి మెట్రో స్టేషన్ లో చేసిన రీల్ ఇక్కడ చూడండి
మరోవైపు, ఆమెనే ‘..అంటే సుందరానికి’ సినిమా నుంచి తందనానంద అనే సాంగ్ కు ఏకంగా మెట్రో రైలులోనే స్టెప్పులేసింది. దీంతో ఈవీడియో మరింతగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలా పబ్లిక్ ప్లేస్ లో అందరు చూస్తున్నా పట్టించుకోకుండా మెట్రోలో ఈ న్యూసెన్స్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత న్యూసెన్స్ చేస్తున్నా మెట్రో అధికారులు ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.