Hyderabad Constables Viral Video: హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం ఓ జిమ్ ట్రైనర్ ను నలుగురు కానిస్టేబుళ్లు కలిసి కింద పడేసి బాదిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు కారకుడై కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ ఏ.శ్రీనాథ్ (పీసీ 4670)ను సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ నగర అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆరోఖ్య రాజ్ విరిగిన కాలుకు ఆపరేషన్ చేసి సరిచేసినట్లు, ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
మెట్టుగూడకు చెందిన ఆరోక్యరాజ్ మద్యం మత్తులో ఈ నెల 3న బస్తీలో హల్ చల్ చేశాడు. దీనిపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ఆరోఖ్యరాజ్ కర్రతో దాడికి యత్నించాడు. దీంతో నలుగురు కానిస్టేబుళ్లు అరోఖ్య రాజ్‌ను నేలకు అదిమి, తన్ని కర్రను లాక్కున్నారు. ఈ క్రమంలోనే అతని కాలు విరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది.
ఈ క్రమంలో ఇంటర్నల్ గా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. కానిస్టేబుల్ శ్రీనాథ్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఆరోఖ్య రాజ్‌పై 13 కేసులు ఉన్నాయని, బాగా తాగి ప్రవర్తించడం వల్ల అతను అతను మెట్టుగూడ స్కెలాబ్ హోటల్‌లో కిందపడ్డాడని పోలీసులు తెలిపారు. అప్పుడే కాలికి గాయం అయిందని వివరిస్తూ చిలకలగూడ పోలీసులు వీడియో ఫుటేజీలను కూడా మీడియాకు విడుదల చేశారు. వాహనంలో పెట్రోలు పోయించుకుని డబ్బులు అడిగినందుకు పెట్రోలు బంకు సిబ్బందిపై దాడి చేసిన వీడియోలను కూడా పోలీసులు షేర్ చేశారు.
వైరల్ అయిన వీడియో
సికింద్రాబాద్ మెట్టుగూడ పరిధిలో ఈ ఘటన జరిగింది. జిమ్ ట్రైనర్ అయిన ఆరోఖ్య రాజ్ అనే వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టారు. పెద్ద కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా బాదారు. కింద పడేసి కొట్టారు. దీంతో ఆ దెబ్బలకు జిమ్ ట్రైనర్ కాలు విరిగింది. అతణ్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read: Ram Gopal Varma: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో RGV ఎంట్రీ, కేసులో వాళ్ల జోక్యం ఉందట! ఆయనకే మద్దతు
Also Read: Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ముజ్రా పార్టీ, యువతులతో అర్ధ నగ్న డాన్సులు!