సైదాబాద్ బాలిక హత్యాచార కేసులో సూసైడ్ చేసుకున్న నిందితుడిని తొలుత పట్టుకోవడం కోసం పోలీసులు విపరీతంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అతడి ఆచూకీ చెబితే రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దీంతో ఇక ఆకతాయిలు రెచ్చిపోయారు. రూ.10 లక్షలు ఇస్తారనే ఆశతో కాల్స్ చేసి అబద్ధాలు చెబుతూ పోలీసులను తికమక పెట్టారు. ‘‘సర్‌.. ఇక్కడ రాజు కనిపించాడు. అరెస్ట్‌ చేయడానికి రండి. రూ.10 లక్షల నగదు బహుమతి నాకే ఇస్తారా..? ఎప్పుడు ఇస్తారు? సార్‌.. రాజును ఇప్పుడే చూశా.. నేను పట్టుకోవాలని ప్రయత్నించా.. పట్టుకునేలోపే ఎక్కడికో పారిపోయాడు. మరి ఆ డబ్బు నాకు ఇచ్చేస్తారా..?’’ అని అడిగారు.


నిందితుడి ఆచూకీ చెబుతారని పోలీసులు నంబర్లు ప్రకటిస్తే.. ఆ ఫోన్ నెంబర్లకు ఇలా వేలాది కాల్స్ వచ్చాయి. ఏకంగా 5 వేల కాల్స్‌ వచ్చినట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీటిలో అన్నీ బూటకపు కాల్స్ కావడం వల్ల పోలీసులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. రాజు గురించి సమాచారం తెలిస్తే 9490616366, 9490616627 నంబర్లకు కాల్‌ చేయాలని పోలీసులు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. రూ.10 లక్షల రివార్డు పొందవచ్చని చెప్పారు. 


Also Read: Amit Shah in Telangana: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి.. ఈ వేడుకలు అప్పటి నుంచి చేస్తాం.. అమిత్ షా వెల్లడి


మరికొందరైతే ఈ ఫోన్‌ నంబర్లు నిందితుడివే అనుకొని పిచ్చి బూతులు తిట్టారు. రాజు ఫోన్ నెంబర్లు అనుకున్న మరికొందరు ప్రబుద్దులు ఏకంగా పోలీసులనే గంజాయి ఉందా అని అడిగారు. కానీ, ప్రతి కాల్‌ను సీరియస్‌గానే తీసుకున్న పోలీసులు.. కొన్ని ప్రశ్నలు వేసి.. నమ్మకం కుదిరాకే ఆ ఫోన్ కాల్‌లో వచ్చిన సమాచారం ఆధారంగా ముందుకు వెళ్లారు.


చివరికి శవమైన రాజు
నిందితుడు రాజు చివరికి రైలు పట్టాలపై శవమై తేలిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించినా.. పలువురు మాత్రం అది ఎన్ కౌంటర్ అని అనుమానిస్తున్నారు. నిందితుడు రాజు తల్లిదండ్రులు కూడా పోలీసులనే అనుమానిస్తున్నారు. తన కుమారుణ్ని ఉరికించి.. ఉరికించి.. చంపేశారని రాజు తల్లి వీరమ్మ ఆరోపించారు. రాజు భార్య కూడా పోలీసులపైనే అనుమానం వ్యక్తం చేశారు. అతను ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులే చంపేసి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని రాజు భార్య ఆరోపణలు చేశారు.


Also Read: Revanth Reddy: కాంగ్రెస్ వస్తే యువకులే బ్రాండ్ అంబాసిడర్లు.. 19 నెలలు పని చేయండి: రేవంత్ రెడ్డి


Also Read: Telangana DGP: రాజు మృతిపై అనుమానాలొద్దు.. వీళ్లంతా ప్రత్యక్ష సాక్షులే.. డీజీపీ క్లారిటీ