Hyderabad News: హైదరాబాద్ లో గురువారం రోజు పార్కులు మూసి ఉంచనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్ఎండీఏ సెలవు ప్రకటించింది. సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఉన్న లుంబినీ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్ లను మూసివేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు.
Hyderabad News: రేపు హైదరాబాద్లో పార్కులు బంద్, కారణం ఏంటంటే?
ABP Desam
Updated at:
21 Jun 2023 03:03 PM (IST)
Edited By: jyothi
Hyderabad News: రేపు హైదరాబాద్ లో పార్కులను మూసి ఉంచబోతున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంబించనున్నారు.
భాగ్యనగరంలో రేపు పార్కులు బంద్, కారణం ఏంటంటే?