సికింద్రాబాద్‌లో అర్ధరాత్రి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్‌చల్‌ చేసింది. వీరని పోలీసులు పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిపైకి కాల్పులు జరిపినట్టు సమాచారం. అయితే పోలీసులు వెర్షన్ వేరేగా ఉంది. 


సికింద్రాబాద్‌లో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠా తిరుగుతోంది. ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుకుంటున్న పోలీసులు నిన్న రాత్రి సడెన్ విజిట్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ముఠా పారిపోయేందుకు యత్నించింది. 


పారిపోతున్నా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై ఒక రౌండ్ కాల్పులు చేశారని అంటున్నారు. చివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి పారిపోయే క్రమంలోజరిగిన పెనుగులాటలో మిస్‌ఫైర్ అయిందని పోలీసులు చెబుతున్నారు. 


ఆసిఫ్‌ నగర్‌లో దొంగను కొట్టి చంపిన స్థానికులు 
అసిఫ్ నగర్ పీఎస్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనానికి ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఈ క్రమంలోనే శబ్దాలు వచ్చాయి. వెంటనే నిద్రలేచిన ఆ ఇంట్లోని వ్యక్తులు దొంగను పట్టుకున్నారు. దొరికిన వ్యక్తిని పోలీసులకు ఫోన్ చేసి అప్పగించే లోపు రెండు దెబ్బలు వేశారు. 


ఇంతలో పోలీసులు రానే వచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇలా తరలిస్తుండగానే ఆ వ్యక్తి చనిపోయాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం పోలీసులకు తెలియడం లేదు. దీనిపై విచారణ చేస్తున్నారు. 


ఉద్యోగాలు ఇస్తామని మోసం
జిహెచ్ఎంసిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం ఓవ్యక్తి కొందరిని మోసం చేశాడు. సర్కిల్ 19 యూసఫ్ గూడ పరిధిలోని బోరబండ సైట్ 2 లో ఎస్‌ఎఫ్‌ఏగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఈ పని చేశాడు. తన కింద పనిచేసే కొంతమంది మహిళలను బెదిరించి ఉద్యోగం మాన్పించాలనే యత్నించాడు. ఆ ఉద్యోగాల్లో వేరే వాళ్లను నియమించాలని చూశాడు. దీని కోసం లక్షల్లో వసూలు చేశాడు. నిత్యం వివాదాల్లో ఉండే శ్రీనివాస్‌పై ఇటీవల బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శానిటేషన్ సిబ్బంది రాకపోయినప్పటికీ సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు తీసుకునేవాడు. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ అతనిపై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.