Fire Accident at shop in Vanasthalipuram:హైదరాబాద్: నగరంలో మరోచోట పేలుడు సంభవించింది. వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో పేలుడు సంభవించడంతో శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రైతుబజార్ సమీపంలో పెట్రోల్ బంక్ ముందు టిఫిన్, స్నాక్స్ షాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం (మార్చి 20న) సాయంత్రం ఆ షాప్‌లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైంది. షాప్ నిర్వాహకుడు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్ధంతో పేలడంతో స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ఘటన ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Fire Accident: వనస్థలిపురంలో భారీ శబ్ధంతో పేలుడు, ఉలిక్కిపడిన ప్రజలు
ABP Desam
Updated at:
20 Mar 2024 07:38 PM (IST)
Hyderabad Fire Accident: వనస్థలిపురంలో భారీ శబ్ధంతో పేలుడు, ఉలిక్కిపడిన ప్రజలు