Hyderabad Crime News: హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లో నివాసముంటున్న కునూరు రోజా అనే మహిళ గత నెల 17వ తేదీన చెత్త పారేసేందుకు బయటకు వచ్చింది. అయితే అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడుని లొక్కున్నాడు. అనంతరం ఆమె చెవి పోగులు కూడా లాక్కునే ప్రయత్నం చేశాడు. మహిళ దొంగతో ప్రతిఘటించినప్పడికీ ఎలాంటి లాభమూ లేకపోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోని మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె వెంటనే ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాల నగర్ ఏసీపీ అధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.


సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడు 23 ఏళ్ల బీకర్ సింగ్ అని.. యాక్టివా స్కూటీపై వచ్చి మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లినట్లు తెలిపారు. గాలింపు చర్యల్లో భాగంగా ఈ రోజు ఉదయం దేవమ్మ బస్తీ, జగద్గిరిగుట్ట లో అనుమానాస్పదంగా తిరుగుతున్న బీకర్ సింగ్ నీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను నేరాన్ని అంగీకరించాడు. అయితే నిందితుడి వద్ద నుంచి 6 గ్రాముల బంగారంతో పాటు హోండా యాక్టివా బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందుతడు బీకర్ సింగ్ ను ఈరోజు రిమాండ్ కు తరలించినట్లు బాలా నగర్ డీసీపీ సందీప్ తెలిపారు.


నేడు మరో ఇద్దరు చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్


హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు ప్టుకున్నారు. వారి వద్ద నుంచి 45 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 6 వేల 900 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ లో నడుచుకుంటూ వెళ్తున్న కనకలక్ష్మి అనే మహిళ మెడలో ఉన్న చైన్ ను లాగేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే సీసీ టీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. 


తుషార్ హిరమాన్ అనే 32 ఏళ్ల నిందితుడు ఈ చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడు తుషార్ హిరమాన్, మీదగడ్డ పద్మాలతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. డబ్బు అవసరమైనప్పుడల్లా చైన్ స్నాచింగ్ లకు పాల్పడేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు చైన్ స్నాచింగ్ కు పాల్పడి చైన్ ను ఎత్తుకెళ్లగా.. పద్మాలత దాన్ని అమ్మే ప్రయత్నం చేసింది. పక్కా సమాచారంలతో రంగంలోకి దిగిన పోలీసులు తుషార్ హిరమాన్ తో పాటు, పద్మలతను అరెస్ట్ చేశారు.