Farm House Deals : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంతో మాకు సంబంధంలేదని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ప్రమాణం కూడా చేశారు. అయితే ఈ వివాదంపై టీఆర్ఎస్ వరుసగా ఆడియో బాణాలు వదులుతోంది. పైలట్ రోహిత్ రెడ్డితో చేసిన బేరసారాల ఆడియోలు విడుదల చేస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలుపై రెండో ఆడియోను టీఆర్ఎస్ బయట పెట్టింది. మొత్తం 27 నిమిషాల పాటు ఆడియో కాల్ కొనసాగింది. ఈ ఆడియోలో స్వామీజీ, మరొకరు డబ్బుల గుర్తించి ప్రస్తావించారు. ఒక్కొక్కరికి ఎంత డబ్బు ఇవ్వాలనే దానిపై ముగ్గురి మధ్య చర్చ జరిగింది.  ఒక్కొక్కరు రూ.100 అడుతున్నారని రామచంద్ర భారతి, సింహయాజితో నందు తెలిపాడు. రెండో ఆడియోలో సంభాషణ ఇలా కొనసాగింది. 








    • నందు : పైలట్‌ రోహిత్‌ రెడ్డితో మాట్లాడాను. ముందుగా వస్తే నువ్వే టీమ్ లీడ్ అవుతావని చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందన్నాను.  

    • రామచంద్ర భారతి : వాళ్లు ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు? 

    • నందు : పైలట్ రోహిత్‌ రెడ్డి రూ. 100 ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు. మిగిలిన వారికి మరో రేటు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. 

    • రామచంద్ర భారతి: నేను పైన చెప్పేటప్పుడు రోహిత్ రెడ్డి తనతో పాటు నలుగురిని తీసుకువస్తానని చెప్తాను. రోహిత్‌ను తీసుకుంటే ఆయనతోపాటు మిగిలినవారు వస్తారు. 

    • నందు : ఇక్కడ వ్యవస్థ సరిగ్గా లేదని పైన చెప్పండి. పైలట్‌ చాలా ముఖ్యమైన లీడర్‌ అని చెప్పండి. 

    • రామచంద్రభారతి: పెద్దవాళ్లతో​ మాట్లాడేటప్పుడు ఒకసారి కమిట్‌ అయితే తిరిగి వెనక్కి వెళ్లలేం​. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డితో కాదు ఇంకా పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం. 

    • నందు : ఈ విషయం ఇక్కడ లోకల్ లీడర్లకు తెలియకూడదు. 

    • రామచంద్రభారతి : మనం చేసే ఈ ఆపరేషన్‌ తెలంగాణ లీడర్లకు తెలియకుండా చేస్తాం. మునుగోడు ఎన్నికల కంటే ముందు రూ. 100 అడిగితే నేను పైన మాట్లాడతాను. నన్ను పైలట్‌ రోహిత్‌రెడ్డితో ఒకసారి మాట్లాడించండి. ఇప్పుడు ఎంత మంది రెడీగా ఉన్నారో తుషార్‌కు చెప్పాలి. మునుగోడు ఎన్నికల కన్నా ముందు ఈ వ్యవహారం కంప్లీట్‌ చేయాలి. వాట్సాప్‌లో కాన్ఫరెన్స్‌లో పెడితే నేను వారితో మాట్లాడాతాను. 

    • సింహయాజులు: 100 కిలోమీటర్ల రేడియస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు మనతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కొడంగల్‌, తాండూర్‌, చేవేళ్ల ఎమ్మెల్యేలతో ఇప్పటికే నేను మాట్లాడాను. 

    • రామచంద్రభారతి : కేవలం ఇద్దరు ముగ్గురి కోసం దిల్లీ నుంచి వాళ్లు రావడం సరికాదు. కనీసం ఐదు, ఆరుగురు అయితే ఢిల్లీ వారిని రప్పించవచ్చు. బల్క్‌గా ఎవరైనా చేరితే ఎక్కువ ఇంపాక్ట్‌ ఉంటుంది. 

    • సింహయాజులు:  రూ. 100 కావాలని పైలట్ రోహిత్‌ రెడ్డి అంటున్నాడు. రాజీనామా చేయాల్సి వస్తే ప్రభుత్వంతో ఢీకొనడం అంత ఈజీ కాదంటున్నాడు.  

    • రామచంద్రభారతి: రోహిత్‌ రాజీనామా చేస్తే ఒక్క నెలరోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది. దిల్లీలోనూ మేం పనిచేస్తున్నాం. 43 మంది దిల్లీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.