Hyderabad News: అనారోగ్యంతో ఉన్న మహిళ ఆస్పత్రికి వెళ్లగా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. సాయం చేస్తున్నట్లు నటించి ఆమెకు దగ్గరయ్యాడు. అప్పటికే ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ భర్త వదిలేయడంతో పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. దీన్నే అదునుగా చేసుకున్న వ్యక్తి తన భార్య తనను వదిలేసిందని చెప్పి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పిల్లలు కూడా వారి బంధాన్ని అంగీకరించారు. ఈక్రమంలోనే తల్లి లేని సమయంలో ఆమె కూతురిపై కూడా సదరు వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అదే విషయాన్ని కూతురు తల్లికి చెప్పింది. చివరకు వీరిద్దరూ కలిసి ఏం చేశారంటే. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్ దాసారంబస్తీకి చెందిన 50 ఏళ్ల మహిళను భర్త వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె 19 ఏళ్ల కుమార్తె, కుమారుడిని కష్టపడి పెద్ద చేసింది. ఇద్దరినీ బాగా చదివించింది. ఈక్రమంలోనే మహిళ కూతురు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితం మహిళకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే 57 ఏళ్ల నాగరాజు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సాయం చేసినట్లుగా నటించాడు. ఆమెను తీసుకొచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దిగబెట్టాడు. తన భార్య తనను వదిలిపెట్టి ఎరితోనో వెళ్లిపోయిందని చెప్పాడు. ఒంటరిగా ఉంటున్నానని.. నీతో కలిసి ఉండాలని ఉందంటూ అతడి మనసులోని విషయాన్ని మహిళకు చెప్పాడు. ఆమెకు కూడా అతడు నచ్చడంతో ఓకే చెప్పింది. వీరి బంధాన్ని వారి పిల్లలు కూడా అంగీకరించారు. నలుగురు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 


అయితే మహిళపైనే కాకుండా ఆమె కూతురిపై కూడా నాగరాజు కన్ను పడింది. దీంతో మహిళ ఇంట్లో లేని సమయంలో ఆమె కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడం ప్రారంభించాడు. తన కోరికను తీర్చాలని ఇబ్బంది పెడుతున్నాడు. చాలా రోజుల పాటు అలాగే భరించలేని యువతి.. ఇక అతడి వేధింపులు తాళలేక విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి నాగరాజుపై తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే కూతురిని తీసుకొని వెళ్లి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నాగరాజును అరెస్ట్ చేశారు. 


ఇటీవలే భార్య సహకారంతో ఆమె కూతుళ్లపై లైంగిక దాడి


ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలంలో ఉండే ఓ మహిళ భర్త చనిపోయాడు. దీంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పుట్టా సతీష్ కుమార్ (43) అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న సదరు మహిళ కొన్నాళ్లు కలిసి జీవనం సాగించారు. అయితే, తనకు పిల్లలు కావాలని పెళ్లి చేసుకున్న సతీష్ మహిళను అడిగాడు. తనకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో మహిళ దారుణ పనికి ఒడిగట్టింది.


తన మొదటి భర్త పిల్లలను సతీష్ వద్దకు పంపింది. యువతులు వెళ్లనని ఏడ్చినా పట్టించుకోకుండా, బలవంతంగా పంపించింది. దీంతో టెన్త్ క్లాస్ చదువుతున్న మొదటి కుమార్తెపై  సతీష్ లైంగిక దాడి చేశాడు. ఆ అమ్మాయి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఆగని దుర్మార్గులు మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో మళ్లీ యువతి గర్భం దాల్చింది. భార్య మొదటి కూతురిపై దారుణానికి పాల్పడింది చాలక...రెండో కుమార్తెపై కూడా వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండో కుమార్తె కూడా గర్భం దాల్చించి. కానీ, ఆ యువతి చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతటి దారుణానికి భార్య సహకారంతోనే భర్త పాల్పడటం షాకింగ్‌గా మారింది. దీంతో, భార్య మొదటి భర్త ఇద్దరు కూతుళ్లపై రెండో భర్త ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన పెదపాడు మండలంలో తీవ్ర కలకలం రేపింది.