తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ పాలిటిక్స్ లో తమ నాయకత్వ లక్షణాలతో దూసుకెళ్తున్నారు. వీరి బాటలో కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు ఇదివరకే పలు విషయాల్లో రాణించి ఆకట్టుకున్నారు. తాజాగా హిమాన్షు రావు సరికొత్త టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ హిమాన్షు రావు ఏం చేశాడంటారా.. తన యూట్యూబ్ ఛానల్ లో ఫస్ట్ కవర్ సాంగ్ ‘గోల్డెన్ అవర్’ను విడుదల చేశారు. ఇంగ్లీష్ సాంగ్ ను తనదైన గాత్రంలో అద్భుతంగా ఆలపించి శభాష్ అనిపించుకుంటున్నారు హిమాన్షు.






అమెరికాకు చెందిన సింగర్, లిరిసిస్ట్ జాకబ్‌ లాసన్‌ పాడిన ‘గోల్డెన్‌ అవర్‌’ సాంగ్‌ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు రావు అద్భుతంగా పాడారు. ఇంగ్లీష్ సాంగ్ ను వెస్ట్రన్ యాక్సెంట్ లో ఉచ్ఛరిస్తూ హిమాన్షు రావు ఆలపించారు. ఈ తన తొలి కవర్ సాంగ్ ‘గోల్డెన్ అవర్’ను యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు హిమాన్షు. తనలో దాగిఉన్న కొత్త టాలెంట్ ను వెలికి తీసినందుకు తన స్నేహితులు, అయాన్ పాట్ని, రుయాన్ లూథ్రాలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ ఫెంటాస్టిక్ వీడియోను ఎడిటింగ్ చేసిన దూలం సత్యనారాయణ, శ్రీకాంత్ పెండ్యాలతో పాటు వారి టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు. తాను పాడిట పాట నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయాలని అడిగారు. పాట ఎలా అనిపించిందో నెటిజన్ల ఎక్స్ పీరియన్స్ ను సైతం పంచుకోవాలని కోరారు.






తనయుడు టాలెంట్ కు కేటీఆర్ ఫిదా


హిమాన్షు రావు పాడిన గోల్డెన్ అవర్ కవర్ సాంగ్ విన్న కేటీఆర్ తనయుడి టాలెంట్ కు ఫిదా అయిపోయా. హిమాన్షు పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ యూబ్యూట్ వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్.. తనయుడు హిమాన్షు టాలెంట్ పట్ల గర్వంగా ఉందన్నారు. మీ అందరూ కూడా ఈ పాటను ఇష్టపడతారని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య ఒక మధురమైన ప్రేమకథను వివరిస్తుంది ఈ సాంగ్. ఆ అబ్బాయి గోల్డెన్ అవర్ సమయంలో తన ప్రియురాలి అందాన్ని ప్రశంసించడమే గోల్డెన్ అవర్ సాంగ్.






మేనల్లుడి పాటపై ఎమ్మెల్సీ కవిత ఫుల్ హ్యాపీస్
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పాటిన కవర్ సాంగ్ ‘గోల్డెన్ అవర్’ను ఎమ్మెల్సీ కవిత విన్నారు. చాలా వినసొంపుగా ఉంది, చాలా గర్వంగా ఉంది అల్లుడు. నీ నుంచి ఇలాంటి మరిన్ని పాటల కోసం ఎదురుచూస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అని ట్విట్టర్ వేదికగా మేనల్లుడు హిమాన్షు రావును మెచ్చుకున్నారు.


ప్రస్తుతం హిమాన్షు రావు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నారు. ఇటీవల తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు హిమాన్షు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీమ్ తో నిర్వహించిన కాస్నివాల్‌కు ఇంఛార్జ్ గా హిమాన్షు రావు వ్యవహరించడం తెలిసిందే.