Glandpharma Genome Valley: ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించబోతున్నట్లు ప్రకటించింది. మొత్తం రూ.400 కోట్లతో పెట్టబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. దీంతో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించింది. ఈరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి ఈ కంపెనీ అధికారులు సమావేశం అయ్యారు. ఆ తర్వాతే గ్లాండ్ ఫార్మా ఈ విషయాన్ని ప్రకటించింది. అలాగే మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా తన కార్యకలాపాలను విస్తరించడం.. తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడితో బయాలజికల్ లాంటి అడ్వాన్స్ ఏరియాల్లో 500 ఉద్యోగాల సృష్టి జరగనుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర లైఫ్ సైన్సెస్, జీనోమ్ వ్యాలీల శక్తి నిత్యం బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.