GHMC News:హైదరాబాద్ మహానగరంలోని కాలనీల్లో ఏదైనా సమస్య వస్తే సిటిజనులు రోజుల తరబడి పరిష్కారం కోసం ఎదురుచూడటం దశాబ్దాల ఆనవాయితీ! అలాంటి పరిస్థితికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని GHMC భావించింది. ఇకపై మీ కాలనీకే నోడల్ అధికారులు వచ్చి, సమస్య ఏంటో తెలుసుకుని, వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. GHMC ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సిటిజన్ గ్రీవెన్స్ డిస్పోజల్ ప్రారంభ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నోడల్  అధికారులే కాలనీకి వచ్చి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఆమె తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రజాసమస్యలను నేరుగా ప్రజల వద్దనే పరిష్కరించేందుకు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సిటీజన్ గ్రీవెన్స్ డిస్పోజల్ కోసం మార్గదర్శకాలను జారీ చేశామన్నారు.


సమస్యలను తెలుసుకొని యుద్ద ప్రాతిపదికన పరిష్కరిస్తారు


సిటీలోని అన్ని సర్కిళ్ల పరిధిలో 4,846 కాలనీలు ఉన్నాయి. అసోసియేషన్ ప్రతినిధులు ఈ నోడల్ టీమ్స్ కలిసి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని యుద్ద ప్రాతిపదికన పరిష్కరిస్తారు. అసోసియేషన్ల ప్రతినిధులు సమస్యలను నోడల్ టీమ్స్ కు తెలియజేయాలి. కాలనీలలో రోడ్లపై ఉన్న గుంతలు, C&D వేస్ట్, స్ట్రీట్ లైట్లు, వాటర్, సీవరేజ్, మెడికల్, ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్స్, లా అండ్ ఆర్డర్ తదితర సమస్యలను నోడల్ టీమ్ పరిష్కరిస్తారు. ఈ నోడల్ టీమ్ శుక్రవారం నుంచి 15 రోజుల పాటు బస్తీలలో పర్యటించి సమస్యలను తెలుసుకుంటారు.


ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్లమ్ లెవల్ ఫెడరేషన్ ప్రతినిధులను మేయర్ కోరారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు పౌర సమస్యలను తెలియజేసిన వెంటనే నోడల్ టీమ్ వెంటనే పరిష్కరించాలని మేయర్ ఆదేశించారు.  


ఈ అంశాలను నోడల్ టీమ్ పరిష్కరిస్తారు



  1. గార్బేజ్, సి అండ్ డి పాయింట్లు

  2. గ్రీన్ వేస్ట్

  3. కాలనీ ప్లాంటేషన్, వాకింగ్ ట్రాక్

  4. మానిటరింగ్ పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్

  5. స్వచ్ఛ ఆటోల మానిటరింగ్

  6. జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లపై అవగాహన

  7. కాలనీ పార్క్, వాకింగ్ ట్రాక్ క్లీన్

  8. చెరువులు, కుంటల్లోవాటర్ పొల్యూషన్ లేకుండా శుభ్రం చేయడం

  9. ఫ్లడ్డింగ్/వాటర్ లాగింగ్‌

  10. డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ (వేసవి కాలంలో)

  11. మార్కెట్ జోన్స్/హాకర్ జోన్స్

  12. పాట్హోల్స్

  13. ఫుట్ పాత్

  14. స్ట్రీట్ లైట్స్  సమస్యలు

  15. నాలా సేఫ్టీ

  16. క్యాచ్ పిట్

  17. పాట్ మోల్స్ ఇష్యూస్

  18. వీధి కుక్కలు/ కోతులు/  పశువులు/ పిగ్ ఇష్యూస్

  19. డి-సిల్టింగ్

  20. ఫైర్ సేఫ్టీ/ మిటిగేషన్  పై ఎడ్యుకేట్ చేయడం

  21. దోమల నియంత్రణ

  22. మ్యాన్ హోల్స్ /కార్టింగ్ ఆఫ్ సిల్ట్

  23. పైప్ లైన్ లీకేజీ

  24. డ్రైనేజీ ,సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్

  25. వాటర్ క్వాలిటీ


 పోలీస్ శాఖకు సంబంధించినవి:



  1. ఈవ్ టీజింగ్

  2. గ్యాంబ్లింగ్

  3. రోడ్ సేఫ్టీ

  4. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం

  5. పబ్లిక్ న్యూసెన్స్


ప్రజారోగ్యాకి రిలేటెడ్:



  1. జ్వరం

  2. ఎన్‌సీడీ


TSSPDCL( విద్యుత్)



  1. లూస్ వైర్/ విద్యుత్ స్తంభాలు


ఇతర స్థానిక సమస్యలపై దృష్టి  


గ్రేటర్లో 4846 కాలనీలకు 360 నోడల్ టీంలను ఏర్పాటు చేశారు. అందులో ఇంజనీరింగ్, శానిటేషన్, యుబీడీ,వాటర్ వర్క్స్, వెటర్నరీ, ఎంటమాలజి, హెల్త్, పోలీస్, ఎలక్ట్రిసిటీ  ఇతర శాఖలకు చెందిన అధికారులు సిబ్బందితో మొత్తం 8 నుండి 10 మంది వరకు ఉంటారు. ఆర్ డబ్లు ఏ  సూచనలు సలహాలు తీసుకొని ఇంకా మిగిలిపోయిన సమస్యల పట్ల దృష్టి సారించి  అక్కడి కక్కడే  పరిష్కరించేందుకు కృషి చేస్తారు.  దాంతో పాటు కాలనీ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తారు.