CMR Shopping mall at Uppal: హైదరాబాద్​ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్​లో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్ ( Uppal CMR Shopping mall ) ముందు వైపు మంటలు చెలరేగాయి. కొంత సమయానికే ఆ మంటలు సీఎంఆర్ షాపింగ్ మాల్ మొత్తం వ్యాపించాయి. మంటలు ఎగసి పడటంతో ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. షాపింగ్ మాల్ ముందు భాగంలో ఉన్న డెకరేషన్​లో మంటలు రాగా, కొన్ని నిమిషాల్లోనే మాల్ మొత్తం వ్యాపించాయిని స్థానికులు చెబుతున్నారు. కాగా, గత ఏడాది అక్టోబర్ నెలలో ఆ షాపింగ్ మాల్ ప్రారంభించినట్లు సమాచారం.

Continues below advertisement


హైదరాబాద్ లో గత నెలలో చివరగా గుడి మల్కాపూర్ లోని అంకుర హాస్పిటల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. హాస్పిటల్ బోర్డుకు మంటలు అంటుకుని కొన్ని అంతస్తులకు మంటలు వ్యాపించడంతో ఆస్తి నష్టం పెరిగింది. అంతకుముందు పంజాగుట్టలోని ఓ అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగాయి. ఓ పోలీస్ శ్రమించి కుటుంబాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించడం తెలిసిందే.