Fact Check: తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత. ఏకంగా అసదుద్దీన్ ఒవైసీకే ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఆమె పేరు ప్రకటించక ముందు నుంచే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక హైకమాండ్ ఆమెకి టికెట్ ఇచ్చాక ఆ పాపులారిటీ మరింత పెరిగింది. సోషల్ మీడియాలోనూ బోలెడంత మంది (BJP Candidate Madhavi Latha) ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇంటర్వ్యూలూ బాగానే పాపులర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. "నేను మహిళనే కాదు" అని మాధవీ లత చెప్పినట్టుగా ఉన్న వీడియో (వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి) విపరీతంగా షేర్ అవుతోంది. చాలా మంది ఆమెని ట్రోల్ చేస్తున్నారు. అయితే...ఇందులో నిజం ఎంత అని ఫ్యాక్ట్ చేయగా...అది ఫేక్ అని తేలింది. ఓ వీడియోని క్రాప్ చేసి అలా ట్రోల్ చేసేందుకు ఎడిట్ చేసినట్టు వెల్లడైంది. ఇంతకీ ఆమె చెప్పిందని ఆరా తీస్తే "నేను మహిళను కాదు. శక్తి స్వరూపాన్ని" అని చెప్పుకున్నారు. కానీ..అందులో శక్తి స్వరూపాన్ని అనే మాటని ఎడిట్ చేసి కేవలం "నేను మహిళను కాదు" అనే క్లిప్‌ని మాత్రమే పోస్ట్ చేశారు. దాన్నే వైరల్ చేస్తున్నారు.
మొత్తం ఆస్తుల విలువ రూ.221 కోట్లు
హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తరపున మాధవీ లత (Madhavi Latha Assets) బరిలోకి దిగనున్నారు. AIMIM కంచుకోట అయిన హైదరాబాద్‌లో ఆమె పోటీ చేస్తుండడం వల్ల అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ మధ్యే ఆమె హైదరాబాద్‌లో ప్రచారం చేస్తూ మసీదుకి విల్లు ఎక్కు పెట్టారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. వివాదాస్పదం కూడా అయింది. దీనిపై స్పందించిన మాధవీలత కావాలనే ఎవరో ఎడిట్ చేశారని, అక్కడ మసీదు ఎక్కడి నుంచి వచ్చిందంటూ మండి పడ్డారు. తను మసీదుకి విల్లు ఎక్కుపెట్టానన్న ఆరోపణలు నిజం కాదని తేల్చి చెప్పారు. ఈ మధ్యే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలనూ పొందుపరిచారు. హైదరాబాద్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఆమెకే ఎక్కువగా ఆస్తులున్నాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.221కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మహిళనే కాదు అంటూ ఆమె కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అవడం పొలిటికల్‌గా మరింత చర్చకు దారి తీసింది. కొందరు కావాలనే ఆమెని టార్గెట్ చేసి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
క్లెయిమ్: "నేను మహిళనే కాదు. నన్ను పదే పదే అలా పిలవకండి"
వాస్తవం: "నేను మహిళను కాదు. నేనో శక్తి స్వరూపాన్ని. మీరు ముందు ఈ విషయం తెలుసుకోవాలి. పదేపదే నన్ను మహిళ అని పిలవకండి. అలా పిలిస్తే నన్ను మీరు తక్కువ చేస్తున్నట్టుగా భావిస్తాను. నేను కేవలం ఓ మహిళను మాత్రమే కాదు. ఇక్కడి ప్రజలందరి శక్తి నాలో ఉంది. వాళ్ల వల్లే నేనున్నాను"
This story was originally published by Boom as part of the Shakti Collective. This story has been translated by ABPDesam staff.
Also Read: Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ