Draupadi Murmu Hyd Tour: హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ద్రౌపది ముర్ము పరేడ్ కు రివ్యూయింగ్ అధికారిగా రావడం ఇదే మొదటి సారి. క్యాడెట్ల పరేడ్, విన్యాసాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో మొత్తం 119 మంది ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీలు, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు శిక్షణ పొందారు. మరో 8 మంది క్యాడెట్లు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో ఇద్దరు వియత్నాం దేశానికి చెందిన క్యాడెట్లు కాగా.. మిగతా ఆరుగురు నేవీ, కోస్ట్ గార్డుకు చెందినవారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రోజు హైదరాబాద్‌కు వచ్చారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జీహెచ్ఎంసీ మేయర్ కూడా స్వాగతం పలికిన వారిలో ున్నారు. ద్రౌపది ముర్ము విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రీవ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరై.. పరేడ్ పూర్తయిన తర్వాత తిరిగి ఢిల్లీకి వెళతారు.
రాష్ట్రపతి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ప్రోటోకాల్ ప్రకారం... మొదట గవర్నర్, తర్వాత ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాల్సి ఉంటంది. ఈ కారణంగా గవర్నర్, సీఎం కేసీఆర్ ముందుగానే బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. పలకరించుకోలేదని తెలుస్తోంది. రాష్ట్రపతి విమానం ల్యాండ్ అయిన తర్వాత .. స్వాగతం చెప్పేందుకు అందరూ వేచి ఉన్న సమయంలో పక్కనే ఉన్న కిషన్ రెడ్డితో..కేసీఆర్ మాట్లాడారు కానీ.. తమిళిసైతో మాట్లాడలేదని.. తెలుస్తోంది. గవర్నర్ తో సీఎం కేసీఆర్‌కు విచ్చిన విబేధాలు సమసిపోలేదని.. భావిస్తున్నారు.