Daggubati Family Land Dispute : భూ వివాదాలు దగ్గుబాటి ఫ్యామిలీని వెంటాడుతున్నాయి. సదరన్ స్పైసిస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నందకుమార్  సిటీ సివిల్ కోర్టు లో పిటిషన్ వేశారు. తనకు అమ్మిన భూమిని కొడుకు రానా కు రిజిస్ట్రేషన్ చేశారని. తనతో పాటు మరొరకిరి కూడా అగ్రిమెంట్ పేరుతో మోసం చేశారని నందకుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు.  కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రిజిస్ట్రేషన్ చేశారన్నారు.  హీరో వెంకటేష్ సైతం తన పేరు మీద 1200 గజాల భూమి తనకు లీజ్‌కు ఇచ్చారన్నారు. ఇప్పుడా లీజ్ పూర్తి కాక ముందే తనను 
బలవంతంగా నన్ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని నందకుమార్ ఆరోపిస్తున్నారు. 


ఐదేళ్లుగా విపత్తుల్లో కేంద్ర సాయం జీరో - లెక్కలు బయట పెట్టిన టీఆర్ఎస్ !


ఇప్పటికే తనకున్న  పరపతి ని ఉపయోగించి పలు రకాలుగా వేధిస్తున్నారని..  పలువురు ఉన్నతధికారులు, రాజకీయ నేతలతో గతంలో బెదిరింపులకు దిగారని ఆరోపించారు. మా కుటుంబం భయంలో ఉందని.. ఏం జరిగిన సురేష్ బాబు దే బాధ్యతని నందకుమార్ స్పష్టం చేశారు.  న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. మంగళవారం నటుడు రాణా విచారణకు హాజరుకావాల్సి ఉన్పప్పటికీ గైర్వాజరయ్యారు. దీంతో నటుడు రాణా విచారణ వచ్చేనెలకు సిటీ సివిల్ కోర్టు వాయిదా వేసింది.


పోలవరం కేంద్రంగా మళ్లీ విభజన సెంటిమెంట్ పాలిటిక్స్ - వర్కవుట్ అవుతుందా ?


ఫిలింనగర్‌కు నటి మాధవిలతకు చెందిన రెండు వేల రెండు వందల చదరపు గజాల స్థలాన్ని సినీనిర్మాత దగ్గుబాటి సురేష్ కొనుగోలు చేశారు. 2014లో ఆ స్థలాన్ని ఓ వ్యాపారికి లీజ్ అగ్రిమెంట్ చేశారు. 2016, 2018లో లీజ్ అగ్రిమెంచ్ రెన్యువల్ చేసుకున్నారు.  లీజ్ అగ్రిమెంట్ కొనసాగుతుండగానే వెయ్యి గజలా స్థలాన్ని దగ్గుబాటి రానాకు రిజిస్ట్రేషన్ చేశారు. లీజు గడువు ఉండగానే వ్యాపారిని స్థలం నుంచి ఖాళీ చేయాలని రానా ఒత్తిడి చేశారు. దీంతో బాధితుడు సిటీసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుండి నోటీసులు రావడంతో కోర్టుకు హాజరయ్యారు. అయితే తనకు స్థలంలో కొంత భాగం అమ్మారని నందకుమార్ చెబుతున్నారు. 


మరో వైపు తమ స్థలాన్ని ఖాళీ చేయించాలని దగ్గుబాటి రానా తరపున కూడా కోర్టులో ఎవిక్షన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి రెండు సార్లు రానా కోర్టుకు హాజరయ్యారు. మరోసారి వచ్చే నెల హాజరు కావాల్సి ఉంది.