వాట్సాప్‌ సమాచారా మార్పిడి కోసమే కాదు. మహిళలకు ఆయుధంగా మారుతోంది. ఈ మధ్య కాలంలో మహిళలను ఏదో రకంగా వేధించే పోకిరీలు ఎక్కువైపోయారు. అలాంటి పోకిరీలు, నేరస్తుల నుంచి క్షేమంగా బయటపడేందుకు అబలకు వాట్సాప్‌ ఎంతో హెల్ప్ చేస్తోంది. దీనికి సైబారాబాద్‌ షీ టీమ్స్‌కు వస్తున్న ఫిర్యాదులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 


వాట్సాప్ మహిళల పట్ల సురక్షిత పాత్ర పోషిస్తుంది. ఆకతాయిల బాధల నుంచి తక్షణ విముక్తి వాట్సాప్ ద్వారా లభిస్తోంది.  వాట్సాప్‌లో ఫిర్యాదులు చూసి సైబరాబాద్ షీ టీమ్స్ అలర్ట్ అవుతున్నాయి. బాధితులను సురక్షితంగా లైంగిక వేధింపుల నుంచి బయటకు తీసుకొస్తున్నాయి. నవంబర్‌లో నమోదైన మొత్తం 98 ఫిర్యాదుల్లో 74 వాట్సాప్ ద్వారా వచ్చినవే అని సైబరాబాద్ షీ టీం అధికారులు చెప్పారు.


నవంబర్‌లో మొత్తం 98 ఫిర్యాదులు అందగా వాటిలో ఎక్కువ శాతం వాట్సాప్‌లో ఉన్నాయి.మహిళా భద్రతా విభాగం నుంచి 13 ఫిర్యాదులు వస్తే... తొమ్మిది నేరుగా అప్రోచ్ అయినవే ఉన్నాయి. ఇమెయిల్, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఒక్కొక్క కంప్లైంట్‌ వచ్చింది. 


వేధింపులు ఉన్నా సరే చాలా మంది నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడతారు. ఆకతాయిల నుంచి సమస్య వస్తుందేమో అన్న భయం వారిలో ఉంటుంది. ఇలాంటి వారి కోసం సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తోంది షీ టీమ్ విభాగం. అలా సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బాధితులు భయపడకుండా నేరస్థుడిపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. అందులో వాట్సాప్‌ కంప్లైంట్‌లో ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. 


నవంబర్‌లో నమోదైన ఫిర్యాదులు చూస్తే.... 
ఫోన్ కాల్స్ రూపంలో వేధింపులకు గురి చేసిన ఫిర్యాదులు-33
బ్లాక్‌మెయిలింగ్‌ ఫిర్యాదులు -14
వేధింపులు- 06
పెళ్లి చేసుకుంటానని మోసం చేసినవి - 12
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా వేధింపులు -03
బెదిరింపు కాల్స్ - 06
అసభ్యకర వ్యాఖ్యలు చేసినవి - 10
నమ్మించి మోసం చేసినవి - 04 
ర్యాగింగ్‌ - 02
ఫాలో చేసి వేధించడం - 08


మహిళల్లో అవగాహాన పెరుగుతుండటంపై పోలీసులు అధికాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన పెరుగుతున్న కొద్దీ వేధింపుల సంఖ్య తగ్గుముఖ పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఫిర్యాదుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 


కంప్లైంట్ దాకా రాని కేసులు మరెన్నో అని అధికారులు అన్నారు. ఫిర్యాదులు ఆధారంగా నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు, 25 పీటీ కేసులు సహా 29 కేసులు బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు. 126 మంది వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి, బాల్య వివాహాలను ఆపడమే కాకుండా 31 మందిని పట్టుకున్నామని అన్నారు.


ఎలాంటి వేధింపులకు గురైన మహిళలు వాట్సాప్ నెం.9490617444కు సందేశం పంపించవచ్చు. నేరుగా డివిజనల్ షీ లేదా డయల్ 100కి కాల్ చేయవచ్చు. షీటీమ్‌కు ఈ-మెయిల్ పంపడం ద్వారా కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చని సైబరాబాద్ పోలీసులు కోరారు. cyberabad @gmail.com లేదా Twitter (@sheteamcybd), Facebook ద్వార పోలీసులను అప్రోచ్ కావచ్చని సూచించారు.