తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోతో సైబర్ మోసలు పాల్పడ్డారు. 9785743029 నెంబర్‌తో వాట్సాప్ క్రియేట్ చేసి జనాలను ముంచేందుకు రెడీ అయ్యారు. దీన్ని పసిగట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా పెట్టి పోలీసులు ఉన్నతాధికారులు, ప్రుముఖులు, సామాన్యులకు మెసేజ్‌లు పంపించడం మొదలు పెట్టారు. దీన్ని గమనించిన కొందరు ప్రముఖులు పోలీసులు దృష్టికి తీసుకొచ్చారు. అంతే అప్రమత్తమైన పోలీసులు దీని వెనుక ఉన్న వారి గుట్టు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు పోలీసు అధికారుల పేరుతో ఫేస్‌బుక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసే వాళ్లు. ఇప్పుడు వాట్సాప్‌లోకి కూడా కేటుగాళ్లు వచ్చేశారు. ఇలాంటి మెసేజ్‌లకు రియాక్ట్ కావద్దని... ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.