వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలి షర్మిలపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని దూషించారని 505(2), 504 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసుపై ప్రెస్ మీట్ పెట్టిన షర్మిల బీఆర్‌ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను అనవసరంగా దూషించారని ఆ పార్టీకి చెందిన నరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కేసీఆర్‌ను దూషించారని షర్మిలపై కేసు నమోదు
ABP Desam
Updated at:
18 May 2023 10:50 AM (IST)
YSR_Telangana_party_president_Sharmila