మూడు గంటలుగా జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ పరామర్శించారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను పరామర్శించేందుకు ఓ సారి విజయలక్ష్మి వచ్చారు. షర్మిలను కలిసేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తర్వాత ఆ పార్టీ లీడర్ గట్టు రామచంద్రరావు వచ్చి కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన్ని కూడా అనుమతి ఇవ్వలేదు. వీళ్లిద్దర్నీ అరెస్టు చేసి ఇంటికి తీసుకెళ్లిపోయారు. కాసేపటికే బ్రదర్ అనిల్ వచ్చి షర్మిలను పరామర్శించారు. 


సిట్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించిన టైంలో ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. బయట ప్రచారంలో ఉన్న వీడియోను షర్మిలకు చూపించారు అనిల్.