BJP JP Nadda Meeting:హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం కొనసాగుతోంది. త్వరలో జరగబోయే శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవలంభించాల్సిన అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు బీఎల్ సంతోష్, బండి సంజయ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి, డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. బీజేపీలో అసంతృప్త నేతలను బుజ్జగించే పూర్తి బాధ్యతలను ఈటల రాజేందర్ కు అప్పగించారు. సమావేశం కోసం రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.










బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న జేపీ నడ్డా.. పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. అంతకు ముందు.. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జేపీ నడ్డాకు... బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయనతో పాటే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ప్రభారీలు వచ్చారు.