Hyderabad MLC Elections:హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం తలపడనున్నాయి. సంఖ్యా బలం లేదని కాంగ్రెస్ ఈ స్థానంలో పోటీ చేయడం లేదు. అటు బీఆర్‌ఎస్ కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న బీజేపీ హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడింది. ప్రత్యర్థి ఎంఐఎం కావడంతో మరింత ఉత్సాహంతో బరిలో దిగుతోంది. 

Continues below advertisement


హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోటీకి సిద్ధపడిన బీజేపీ అభ్యర్థిగా ఎన్ గౌతంరావు నామినేషన్ వేశారు. అటు ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్ ఉల్ అసన్‌ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ప్రభాకర్‌ రావుపదవీ కాలం ఏప్రిల్‌తో ముగియనుంది. ఆ స్థానంలో ఎమ్మెల్సీని ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ స్థానం కోసం నాలుగు దరఖాస్తులు వచ్చాయి. బీజేపీ, ఎంఐఎం నుంచి ఒక్కో నామినేషన్ రాగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు.  


కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు ఉండటంతో ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో పోటీ అనివార్యమైంది. ఈ స్థానానికి ఏప్రిల్‌ 4న నామినేషన్లు తీసుకోనున్నారు. ఏప్రిల్‌ 7న వాటిని పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 9 గడువు ఇచ్చారు. ఏప్రిల్‌ 23న ఉదయం 8 గంటల పోలింగ్‌ జరగనుంది. 25న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.  


ఎవరీ మీర్జా రియాజ్ ఉల్ అసన్‌? 
మీర్జా రియాజ్ ఉల్ అసన్‌ 2019లోనే ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. కానీ ఆ పదవి 2023తోనే ముగిసింది. అందుకే ఇప్పుడు మరో ఛాన్స్ ఇస్తున్నారు. ఆయన 2009లో నూర్ ఖాన్ బజార్, 2016లో డబిర్‌పురా కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 


ఎవరీ గౌతమ్‌రావు? ఆయన్ని రాజాసింగ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గౌతమ్‌రావు హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ఎప్పటి నుంచో పార్టీకి పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి పని చేస్తున్నారు. ఆయన పనిచేశారు. అభ్యర్థిగా గౌతమ్‌ రావును ప్రకటించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడుతున్నారు. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గానికే పదవులు ఇస్తున్నారని మిగతా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాంగిరీ చేసేవాళ్లకే పదవులు కట్టబెడుతున్నారని ఆసంతృప్తి వ్యక్తంచేశారు. 


నెల రోజుల క్రితమే బీజేపీ తీన్ మార్ 


నెల రోజుల క్రితం జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా రెండింటిని కైవశం చేసుకున్న బీజేపీ మరో స్థానంలో మద్దతుదారుణ్ని గెలిపించుకుంది. ఉమ్మడి కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల పట్టభద్రుల, టీచర్స్‌ ఎమ్మెల్సీ సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. బిజెపి నేతలు మల్క కొమరయ్య, చిన్నమైల్‌ అంజిరెడ్డి ఈ రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం టీచర్ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి ఎంగిలి శ్రీపాల్ రెడ్డి కూడా గెలుపొందదారు.