హైదరాబాద్: ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో అధికారుల్ని డెమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం: బండి సంజయ్ కుమార్
- కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది.
- తెలంగాణ అధికారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకోం
- కేసీఆర్ చేసిన తప్పులకు అధికారులు బలి అవుతున్నారు
- బకాయిలు చెల్లించకుండా కేసీఆర్  విద్యుత్ సంస్థల్ని  నష్టాల పాల్జేశారు. 
- ఏప్రిల్ లో ఇవ్వాల్సిన కొత్త పే రివిజన్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయినా కూడా ఉద్యోగులు కష్టపడి సంస్థలను కాపాడుకుంటున్నారు.
- ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే ఉన్న ఉద్యోగుల్ని  తొలగిస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వమంటే డిమోషన్ చేస్తున్నారు.
- డిమోషన్ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి.
- బాధిత అధికారులు చేసే పోరాటానికి బిజెపి అండగా ఉంటుంది.: బండి సంజయ్ కుమార్


హైదరాబాద్: ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో అధికారుల్ని డెమోట్ చేయడం తెలంగాణ సీఎం కేసీఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.  కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తెలంగాణ అధికారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా బీజేపీ చూస్తూ ఊరుకోదు అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన తప్పులకు అధికారులు బలి అవుతున్నారంటూ మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుండా కేసీఆర్ విద్యుత్ సంస్థల్ని నష్టాలపలు చేశారని ఆరోపించారు. 
ఏప్రిల్ లో ఇవ్వాల్సిన కొత్త పే రివిజన్ ఇప్పటి వరకు ప్రకటించలేదని, అయినా కూడా ఉద్యోగులు కష్టపడి సంస్థలను కాపాడుకుంటున్నారుని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే ఉన్న ఉద్యోగుల్ని  తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రమోషన్లు ఇవ్వమంటే డిమోషన్ చేస్తున్నారని, సీఎం కేసీఆర్ డిమోషన్ లాంటి తుగ్లక్ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని సూచించారు. బాధిత అధికారులు చేసే పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ కుమార్ అన్నారు.


అధికారం కోసం బీజేపీ ఏనాడూ అడ్డదారులు తొక్కబోదనన్నారు. మూల సిద్ధాంతం ఆధారంగానే తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నామని స్పష్టం చేశారు.  కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ప్రశిక్షణా శిబిరాల ముఖ్య ఉద్దేశమన్నారు. బీజేపీ తెలంగాణ ప్రశిక్షణా శిబిరం ప్రారంభ సమావేశానికి బండి సంజయ్ , కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర శాఖ మూడు రోజులపాటు నిర్వహించే ప్రశిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. అధికారంలోకి రావడానికి శిక్షణా శిబిరాలు అక్కర్లేదనే భావన కొందరిలో ఉంటుందని కానీ సరైనా విధానం కాదన్నారు. నాటి జనసంఘ్ నుండి నేటి వరకు ప్రతి రెండేళ్లకోసారి శిక్షణా శిబిరాలు కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు.  బీజేపీ ఏనాడూ అధికారం కోసం అర్రులు చాచలేదని, అడ్డదారులు తొక్కలేదని బండి సంజయ్ అన్నారు. మూల సిద్ధాంతం ఆధారంగా అధికారంలోకి రావాలనుకుంటున్నామన్నారు.