హుజూరాబాద్ ఉప ఎన్నికల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లో స్పందించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన ఫలితాలను సమీక్షిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల తీరుపై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని మాట్లాడినా ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థేనని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటలే గెలవబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజయం తాము ఊహించినదే అని అన్నారు. 






హుజూరాబాద్ ప్రజలు డబ్బులను కాదని చైతన్యాన్ని చాటారని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్‌తో విరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. హామీలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారని.. ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని అన్నారు. ఓటర్లను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. 


Also Read: Huzurabad : కాంగ్రెస్ ఓటర్లే ఈటలకు బలమయ్యారా ? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?


ఇక టీఆర్ఎస్ పతనమే..: డీకే అరుణ
దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీ ఆధిక్యం కనబర్చిందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుపై ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలతోనే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని అన్నారు. ఆత్మ గౌరవం, అహంకారానికి మధ్య జరిగిన పోరాటంలో ఆత్మగౌరవమే గెలుస్తుందని అన్నారు. తెలంగాణ మొత్తం హుజూరాబాద్ తీర్పునే కోరుకుంటోందని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు.


Also Read : హుజూరాబాద్‌లో గుర్తుల గోల.. టీఆర్ఎస్, బీజేపీ కొంప ముంచుతున్న ఆ రెండు సింబల్స్


‘‘డబ్బులు పంచి ఓట్లు కొనాలని అనుకున్నా.. హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవం వైపే నిలబడ్డారు. హుజూరాబాద్ ప్రజలకు నా సెల్యూట్’’ అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికార యంత్రాంగం మొత్తాన్ని రంగంలోకి దింపినా వారి వ్యూహం ఫలించలేదని డీకే అరుణ అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఇస్తు్న్న తీర్పు చరిత్రాత్మకమైనదని అన్నారు. హుజూరాబాద్ తీర్పు ఒక కనువిప్పు అని అన్నారు. అభ్యర్థి ఎవరో తెలియనట్లుగా కేసీఆర్ రంగంలోకి దిగారని, కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఓడిస్తారని అన్నారు. 






Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి