తెలంగాణలో ఈ మధ్య టెట్ ఫలితాలు వచ్చాయి. అందులో చాలా మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. అలాంటి వారందరికీ ఇది నిజంగా గుడ్ న్యూస్. వీళ్ల కోసం తెలంగాణ దివ్యాంగుల, వృద్దుల సంక్షేమ శాఖ మరో నోటిఫికేషన్ వేసింది. ఇందులో ఎంపికైన వారికి నెలకు 30వేలకుపైగా జీతాన్ని ఇవ్వబోతోంది.
బీఈడీ చేసిన అభ్యర్థుల నుంచి దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిగ్రీ లేదా సోషియాలజీ, సోషల్ వర్క్‌లో ఎంఏ చేసిన ఉండాలి.
మొత్తం ఖాళీలు:-
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(TGT) పోస్టుల-15
ఎస్జీబీటీ ఉద్యోగాలు-15
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు-02
వార్డెన్ పోస్టులు- 10
విద్యార్హతలు:-
ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, స్పెషల్ బీఈడీ(HH/VH) చేసిన వాళ్లు అర్హులు. ఇంగ్లీష్ మీడియంలో బోధించే అనుభవం ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. రిటైర్డ్ టీచర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
1. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్:
ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. బీఈడీ, ప్రత్యేక బీఈడీ(HH/VH), డీఈడీ (HH/VH) లేదా ఏదైనా ఇతర తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
2. SGBT ఉపాధ్యాయులు:
ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు గుర్తింపు ఉన్న సంస్థ నుంచి దృష్టి వికలాంగులు / వినికిడి వికలాంగ పిల్లలకు బోధించే సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
3. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్:
గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ లేదా దాని తత్సమానం అర్హత ఉన్న సంస్థ జారీ చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
4. వార్డెన్లు:
(i) ఏదైనా సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. లేదా M.A. (సోషల్ వర్క్) లేదా M.A. (సోషియాలజీ) లేదా
సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో డిప్లొమా చేసి ఉండాలి.
(ii) తప్పనిసరిగా D.Ed (HH/VH) లేదా దీనికి సమానమైన డిగ్రీ కలిగి ఉండాలి. లేదా స్పెషల్ బీఈడీ (VH/HH) చేసిన వాళ్లు కూడా అర్హులే.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 01.07.2022. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/BC/PwDలకు వయస్సు సడలింపులు ఉంటుంది.)
అనుభవం: బోధనా రంగంలో అనుభవం ఉన్న దరఖాస్తుదారులు ఎంపికలో ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యత ఇస్తారు.
జీతం:-
ట్రైన్డ్ గ్యాడుయేట్ టీచర్స్ 35000/
ఎస్జీబీటీ టీచర్స్ 30,000/
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 30,000/
వార్డెన్స్ 35,000/
ఎంపిక
ఎంపికకు అవసరమైన విద్యాకోర్సులో మీరు సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఎక్కడ పని చేయాలి
VH విభాగంలో ఎంపికైన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు, SGBT ఉపాధ్యాయులు కరీంనగర్, మహబూబ్ నగర్‌లోని దివ్యాంగుల ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పని చేయాల్సి ఉంటుంది.
HH కేటగిరీలో ఎంపికైన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు, SGBT ఉపాధ్యాయులు కరీంనగర్,
మిర్యాలగూడ, హైదరాబాద్‌లోని దివ్యాంగుల ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల పనిచేయాల్సి ఉంటుంది.
వార్డెన్‌ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని హాస్టల్స్‌లో పని చేయాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి:-
http://www.wdsc.telangana.gov.in. వెబ్‌సైట్‌లో నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని పూర్తి చేసిన తర్వాత దానికి మీ విద్యార్హతల పత్రాలు జత చేయాలి. ఆ పత్రాలను స్కాన్ చేసిన తర్వాత cdwtghyd@gmail.com మెయిల్ అడ్రస్‌కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. జులై 23 సాయంత్రం లోపు మెయిల్ చేయాల్సి ఉంటుంది.