Agnipath Protests In Hyderabad: నిన్నటివరకూ ఉత్తరాధి రాష్ట్రాల్లో చెలరేగిన అగ్నిపథ్ వివాదం నేడు తెలంగాణలోనూ ప్రభావం చూపుతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. పలు రైళ్లకు నిప్పు (Train Set On Fire Secunderabad) పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్టేషన్ బయట సైతం కొన్ని బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అగ్ని పథ్ పథకాన్ని రద్దు చేసి రెగ్యూలర్ గా సైన్యంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్ఎస్‌యూఐ సంఘాలు అల్లర్లకు కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమకు ఈ అల్లర్లు, విధ్వంసంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.


దాడులకు పాల్పడింది మేం కాదు..
అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రద్దు కావడంతో కొన్ని గంటల వ్యవధిలో 44 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ చెప్పారు. కొందరు తమ కార్యకర్తలు, సంఘాల నేతలు సికింద్రాబాద్‌లో అల్లర్లతో విధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారని, వీటిని తాను తీవ్రంగా ఖండించారు. అగ్నిపథ్ కొత్త విధానం వల్లే అభ్యర్థులు ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. తాను ఉదయం ఓ ఈవెంట్‌కు వెళ్తుంటే తనను మధ్యలోనే అడ్డుకుని షహనాజ్ గంజ్ పీఎస్‌కు తరలించారని చెప్పారు. ఎవరూ ఇలాంటి దాడులకు పాల్పడవద్దని, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని ఆందోళనకారులకు, అభ్యర్థులకు సూచించారు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికి పోతుంది. ఆందోళనకారులు చెలరేగడంతో పోలీసులు సైతం ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. కర్రలతో, రాళ్లతో రైళ్లను కొడుతూ,  బోయి గూడ ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ వద్ద ఉన్న ఇంజన్ కి కొందరు ఆందోళనకారులు నిప్పు పెట్టె ప్రయత్నం చేశారు. ఈస్ట్ కోస్ట్ రైలుకు 5 బోగిల కు నిప్పు పెట్టగా.. పోలీసులు, రైల్వే కార్మికులు కలిసి బోగీల్లో మంటాలార్పుతున్నారు. రైల్వే పోలీసులకు సహాయం చేసేందుకు రెగ్యూలర్ పోలీసులు సికింద్రాబాద్‌కు చేరుకుంటున్నట్లు సమాచారం. అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించినట్లు సమాచారం.


Also Read: Agnipath Protests In Hyderabad: అగ్గి రాజేసిన ఆందోళనలు- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం, పలు రైళ్లకు నిప్పు


Also Read: Agneepath Recruitment Scheme: అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది