Hydra Effect:   హైదరాబాద్ లో తాజాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఏపి పై సైతం ప్రభావం చూపుతోంది. గత పద్నాలుగేళ్లుగా ఎన్ కన్వెన్షన్ పై పోరాటం చేస్తున్న జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డికి వందల కొద్ది ఫోన్లు వస్తున్నాయి. ఏపి చెరువులను చూడండి అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.   ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తరువాత కూడా వివాదం సర్దుమణగలేదు. ఈ నేపధ్యంలో గత పద్నాలుగేళ్లుగా ఎన్ కన్వెన్షన్, తమ్మిడి చెరువు ఆక్రమణలపై పోరాటంచేస్తున్న జనం కోసం అనే సంస్ధ వ్యవస్దాపక అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డిని కలిసింది ఏబిపి దేశం.భాస్కరెడ్డి ఏమన్నారంటే..?


 ప్రశ్న.. ఎన్ కన్వెన్షన్ పై ఈ గందరగోళం ఏంటి.. అది ప్రభుత్వ స్దలమా..లేక నాగార్జున అన్నట్లు ప్రవేటు భూమా...?


భాస్కర్ రెడ్డి : 2010 లో చెరువులు, భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని మాకు సమాచారం రావడంతో మేము జనం కోసం అనే సంస్దను ఏర్పాటు చేసాం. శేరిలింగంపల్లి పరిధిలోని చెరువులను గుర్తించి, అధికారులకు ఫిర్యాదు చేయడం,వారు పట్టించుకోకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగేది. అదే క్రమంలో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ ఈ చెరువులో నిర్మించారని స్దానికులు మాకు సమాచారం ఇచ్చారు. మేము వెళ్లి పరిశీలించగా తమ్మిడికుంట చెరువు పూర్తి స్దాయిలో అక్రమణకు గురవుతున్నట్లు మేము గుర్తించాము. ఈ 2011 లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు మేము ఫిర్యాదు చేశాము. ఆ తరువాత అనేక ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదు. ఎందుకంటే నాాగార్జున హీరో కావడంతో ఫిలితం లేకుండాపోయింది. అప్పట్లో విజయం సాధించలేకపోయాము. ఈ నేపధ్యంలో ఓసారి ఇరిగేషన్ ఈఈ , ఎన్ కన్వెన్షన్ కాంపౌండ్ వాల్  తమ్మిడికుంట చెరువు పరిధిలోకి వస్తోందని మాకు లేఖ ఇవ్వడం జరిగింది. అదే మాకు ఓ ఆయుధంగా దొరికింది. లోకాయుక్తకు ఫిర్యాదు చేసాము. స్పందించిన  లోకాయుక్త హెచ్ ఎండీఏ,ఇరిగేషన్ ,రెవెన్యూకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది..


'ఆధారాలు చూపిస్తే నా వాళ్లవైనా దగ్గరుండి కూల్చేయిస్తా' - సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


ప్రశ్న.. తాజాగా కోర్టు స్టే నేపధ్యంలో  నాగార్జున అభిమానుల్లోనూ, ప్రజల్లో ఎన్ కన్వెన్షన్ అక్రమణపై ఇంకా అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏది నిజం..?


గతంలో తెరాసా ప్రభుత్వం నాగార్జునకు తలొగ్గింది. పట్టించుకోలేదు. నోటీసు ఇచ్చి సరిపెట్టుకుంది. దీంతో నాగార్జున కోర్టుకు వెళ్లాడు. చట్టప్రకారం వ్యవహరించమని అప్పట్లో కోర్టు తెలిపింది. దీంతో కూకట్ పల్లి కోర్టుకు నాగార్జున వెళ్లారు. ఇప్పటికీ కూకట్ పల్లి కోర్టు సైతం ఎటువంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వాన్ని ఓసారి పరిశీలించమని మాత్రమే చెప్పింది.ఇదే విషయాన్ని తమకు అనుకూలంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు  హీరో నాగార్జున.


మా పాతికేళ్ల పోరాటంలో హైడ్రా కమీషనర్ రంగనాధ్ వం    టి అధికారిని చూడలేదు. ఎన్ కన్వెన్షన్ పై నాతో ఇరవై నిమిషాలు మాట్లడి నేను ఇచ్చిన పూర్తి వివరాలు,కోర్టు ఆర్డర్ కాపీలు పరిశీలించారు.పద్నాలుగేళ్ల నా పోరాట, ఇచ్చిన ఆధారాలు చూసి రంగనాధ్ సైతం ఆశ్చ్యపడ్డారు. ఇంత క్లియర్ గా ప్రభుత్వ చెరువును మూడు ఎకరాల ముఫై కుంటలు  కబ్జాచేసిన నట్లు ఉంటే ఇన్నాళ్లు ఎలా వదిలేశారంటూ ఆర్చర్యపొయారు. ఆరోజే నా పొరాటానికి న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగింది.


ప్రశ్న.. ఎన్  కన్వెన్షన్ కూల్చేశారు.. స్దలం స్వాధీనం పై నెక్ట్స్ ఏంటి..


కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. యాధాతద స్దితి కొనసాగించమని తెలిపింది.హైడ్రా లీగల్ టీమ్ కోర్టులో పూర్తి ఆధారాలను త్వరలో సమర్పించబోతోంది.కచ్చితంగా త్వరలో అది చెరువు భూమి అని కొోర్టు ప్రకటిస్తుింది. నాగార్జున స్వచ్చందంగా ముందుకు రావాలి. జరిగిన తప్పును తెలుసుకోవాలని కోరుతున్నాం.


ప్రశ్న .. ఇంకా చెరువు కబ్జాపై ఎన్ని కేసులు నమోదు చేసారు. 


హైదరాబాద్ నగరంలో చెరువులు, నాళాలు, కబ్జాపై మేము లోకాయుక్తలో ఇప్పటికీ నలబై కేసులు ఫైల్ చేసాము. మా వద్ద వంద ఫిర్యాదు లు సిద్దంగా ఉన్నాయి. బఢాబాబుల చిట్టాలు ఒకదాని తరువాత ఒకటి బయటపడతాం.ఏపిలోని వివిధ జిల్లాలు తిరుపతి, శ్రీకాకుళం నుండి సైతం ఫోన్ లు వస్తున్నాయి. కచ్చితంగా చెరువులను రక్షించుకుంటాం.


జన్వాడ ఫామ్ హౌస్ వద్ద ఇరిగేషన్ అధికారుల కొలతలు - కాసేపట్లో కూల్చివేత?