ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ వచ్చిందన్న సంతోషాన్ని దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. సెలబ్రెటీలంతా ట్రిపుల్ ఆర్ టీంను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇదే టైంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నెటిజన్లకు దొరికేశారు. ట్రిపుల్ ఆర్‌కు వ్యతిరేకంగా గతంలో ఆయన ఇచ్చిన వార్నింగ్ డైలాగ్స్‌ను పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌తోపాటు నెటిజన్లంతా ఆడేసుకుంటున్నారు. 

Continues below advertisement


ట్రిపుల్ ఆర్‌ చిత్రీకరణ టైంలో ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేసింది రాజమౌళి టీం. ఎన్టీఆర్‌ తలపై ముస్లిం టోపీ ధరించి కనిపించారు. దీన్నే బీజేపీ తప్పుపట్టింది. బండి సంజయ్‌ లాంటి వాళ్లు తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. ఆ సీన్‌లు మార్చకుంటే మాత్రం సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు కూడా. సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం బరిశెలతో కొడతామన్నారు. థియేటర్ల వద్దకు ఎవరూ వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చారు. 






అప్పట్లో బండి సంజయ్‌ సహా కొందరు బీజేపీ లీడర్లు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇప్పుడు ఆస్కార్‌స్థాయికి వెళ్లి ట్రిపుల్‌ టీంను ప్రశంసిస్తూనే అలాంటి వారిని బెదిరించిన బండి కామెంట్స్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంత గొప్ప కళాఖండంపై కొందరు విషం చిమ్మారంటూ అప్పట్లో బండి సంజయ్ చేసిన కామెంట్స్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. 
అలా ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్‌.... అదే పెద్ద మనిషి మోడీ వల్లే ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ వచ్చిందని కూడా చెప్పగలరంటూ ఎద్దేవా చేశారు. 






అప్పట్లో ట్రిపుల్‌ ఆర్‌పై నోరు పారేసుకున్న వ్యక్తే ఇప్పుడు ఆస్కార్ వచ్చిందని శుభాకాంక్షలు చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.   ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రకమంటూ విమర్సలు చేస్తున్నారు.