Rapido Driver News: హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ యాప్‌లో ఓ వ్యక్తి టూవీలర్‌ను బుక్ చేసుకున్నాడు. అది కాస్త మార్గ మధ్యలో సతాయించింది. పెట్రోల్ అయిపోయిందట. ఈ టైంలో ఇంకొకరెవరైనా వేరే వెహికల్ బుక్ చేసుకొని పని చూసుకుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తను దిగబోనని తెగేసి చెప్పేశాడట. దీంతో టూవీలర్ డ్రైవర్‌ ఆవ్యక్తిని అలానే కూర్చొబెట్టుకొని తోసుకుంటూ దగ్గరిలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.


ఇందులో ఆ ఇద్దరి వెర్షన్ కూడా తెలియదు. అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెగటివ్‌గా ట్రోల్ అవుతోంది. ఇలా చేయడం తప్పని ఆ కస్టమర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 


ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. ఎలాంటి వారైనా ఆ పరిస్థితిలో డబ్బులు ఇవ్వబోమనో, లేకుంటే ఫిర్యాదు చేస్తామనో చెప్పి అక్కడే దిగిపోతారు. ఇంకొక వెహిల్ చూసుకోవడమో... లేదా ఆ వ్యక్తితో నడిచి వెళ్లడమో చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు అంటే... కస్టమర్‌కు ఏమైనా హెల్త్ ప్రోబ్లమ్‌ ఉందేమో లేదా నడవలేని స్థితిలో ఉన్నాడేమో అన్న అనుమానం కూడా చాలా మందిలో వస్తోంది. 


ఏదైనా సరే అలా వెహికల్‌పై కూర్చొని డ్రైవర్‌తో వాహనాన్ని నెట్టించుకోవడం మాత్రంపై విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు తీవ్రంగా తప్పపడుతున్నారు. అలా పార్ట్‌టైం సంపాదన కోసం ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ యాప్‌ల ద్వారా పని చేసే వాళ్ళు కూడా మనుషులేనని అంటున్నారు.