తెలంగాణ పోలీసుశాఖలో తాజాగా మరిన్ని శునకాలు చేరనున్నాయి. మొయినాబాద్ లోని డాగ్ పెరేడ్ గ్రౌండ్ లో శునకాల కోసం ప్రత్యేక గ్రౌండ్ ని ఏర్పాటు చేసి వాటికి శిక్షణ అందించి విధుల్లో ఉపయోగిస్తారు. ప్రమాదాలను ముందస్తుగానే ఎలా పసిగట్టాలి? ఎంత దూరం నుండి పసిగట్టాలి? అన్న దానిపై వీటికి శిక్షణ ఇస్తారు. ముందుగా సెలెక్ట్ అయిన వాటికి పుర్తిస్థాయిలో శిక్షణ అందిస్తారు. ఈరోజు జరగనున్న పెరేడ్ లో 48 శునకాల లతోపాతు 64 మంది శిక్షణ ఇచ్చేవారు విధుల్లో చేరనున్నారు. వీటికి మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఎనిమిది నెలల శిక్షణ పూర్తయింది. నేడు జరగబోయే దాంట్లో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహిస్తునారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
సాధారణంగా మూడు నెలల వయసున్నవాటినే శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. ఒక శునకాన్ని పర్యవేక్షించేందుకు ఒక కానిస్టేబుల్ ను కేటాయిస్తారు. పోలీసు శాఖలో ఉన్నంతవరకు అతడే దానికి యజమానిగా ఉంటాడు. మొదటి నెలలో గ్రూమింగ్, వాకింగ్, బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. నాలుగు నెలలు వచ్చే వరకు వాటికి రకరకాల శిక్షణ అందించి, ప్రతి రెండు నెలలకు వాటికి టెస్ట్ పెడతారు. అయిదు నెలలపాటు పేలుడు పదార్ధాలను, మాదకద్రవ్యాలను గుర్తించడంతో పాటు నిందితుల ఆచూకీ కనిపెట్టడం వంటి అసలైన అంశాల్లో శిక్షణనిస్తారు. దీనికితోడు క్రమశిక్షణగా మెలగడంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉంటుంది. ఎనిమిదేళ్ల తరువాత వాటితో ఉద్యోగ విరమణ చేయిస్తారు. వయసు పెరిగేకొద్దీ వాసన పసిగట్టే శక్తి తగ్గిపోతుండడం దీనికి ప్రధాన కారణం. ఉద్యోగ విరమణ అనంతరం వాటిని యజమానికి అప్పగిస్తారు. తెలంగాణ పోలీసుశాఖ లాబ్రడార్, డాబర్మన్, అల్ఫీషియన్, గోల్డెన్ రిట్రీవర్, డాల్మే షన్, జర్మన్ ఫర్డ్, బెల్జియం మాలినోస్ రకాలను మాత్రమే. ఎంపిక చేసుకుంటోంది. ఇవి కాకుండా విమానాశ్రయాల్లో తనిఖీల కోసం చిన్నవిగా కనిపించే కోకోర్ స్పానియల్ జాతి శునకాలనూ వినియోగిస్తున్నారు. ఇతర జంతువులతో పోల్చితే వీటికి వాసన పసిగట్టే శక్తి 40 రెట్లు అధికం. వీటికి వినికిడి శక్తి 20 రెట్లు.. కంటిచూపు 10 రెట్లు అధికం. పేలుడు పదార్ధాలను పసిగట్టడంలోనూ ఇవి దిట్ట. ఈసారి అరుణాచల్ ప్రదేశ్కు చెందిన శునకాలు ఇక్కడ శిక్షణ పొందాయి. గతం లోను ఇతర రాష్ట్రాల సునకలు మన హైదరాబాద్ మొయినాబాద్ లో శిక్షణ పొందాయి. తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న నేరాలను పసిగట్టడంలో వీటి పాత్ర ఉంది. మాదకద్రవ్యాలను పట్టుకోవడం, నిందితుల ఆచూకి కనిపెట్టడంలో ఇప్పటికే గుర్తింపు దక్కించుకున్నాయి. మొయినాబాద్ లో జరుగుతున్న ఈ పరేడ్ ని చూడడానికి జంతు ప్రేమికులు, స్టూడెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. వాటికీ ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారన్న దానిపై ప్రజలకు ఆసక్తి పెంచుతోంది ఈ పరేడ్.
ట్రైనింగ్ లో ఆసక్తి ఉన్నవారు తమ పెంపుడు కుక్కలను సైతం ఈ శిక్షణ లో పంపిస్తారు. అలా పంపాలంటే సెలెక్టెడ్ బ్రీడ్ కావాల్సి ఉంటది. మూడు నెలల వయసు ఉన్న చిన్న డాగ్స్ ని శిక్షణలో ఇవ్వాల్సి ఉంటుంది. దానితో పాటు సర్టిఫైడ్ డాగ్ పారెంట్ సర్టిఫికేట్ అందించాలి. రిటైర్మెంట్ తరవాత మన శునకం కావాలంటే మనకి తిరిగి ఇచ్చేస్తారు.