CM KCR On Munugodu : మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో శనివారం శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ రెండోస్థానం, బీజేపీ మూడోస్థానంలో నిలుస్తోందని కేసీఆర్ అన్నారు. మునుగోడు సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మునుగోడులో రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జ్ గా నియమిస్తామని వెల్లడించారు.  


డిసెంబర్ నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ 


తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈనెల 6, 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ చివరి నాటికి ప్రతి నియోజకవర్గానికి 3 వేల రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ లో జాతీయ స్థాయి దళిత సదస్సు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే, బీజేపీ మాత్రం మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు.  






టీఆర్ఎస్ కు 41 శాతం ఓట్లు 


మునుగోడు సర్వే రిపోర్టును సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పీ భేటీలో వెల్లడించారు. మునుగోడులో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్‌లో మునుగోడు ఉప ఎన్నికపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.  మునుగోడు ఉపఎన్నికపై సర్వే రిపోర్ట్‌ను వెల్లడించారు. టీఆర్‌ఎస్‌కు 41 శాతం ఓట్లు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జ్‌లుగా పంపిస్తామని, ఒక్కో ఎమ్మెల్యేకు రెండు గ్రామాలకు చొప్పున బాధ్యతలు అప్పగిస్తామన్నారు. బీజేపీ నేతలు ఏంచేసినా గెలవలేరన్నారు. 


ఈడీ, సీబీఐని చూసి భయపడొద్దు


ఈడీ, సీబీఐని చూసి భయపడొద్దని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్‌ చేస్తాయన్నారు. శివసేన, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీలను ఇప్పటికే టార్గెట్‌ చేశాయన్నారు. బీజేపీ మరింత దాడి చేస్తుందని, బెదిరింపులను పట్టించుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు. మహారాష్ట్రంలో చేసినట్లు తెలంగాణలో కుదరదన్నారు. బీజేపీ టీఆర్ఎస్ ను ఏం చేయలేదని స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బిహార్‌, దిల్లీలో బీజేపీ పాచికలు పారలేదన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అడ్రస్‌ గల్లంతవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. 


Also Read : TS Cabinet Decisions : సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినం, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!


Also Read : Nirmala Sitharaman : హైదరాబాద్ పన్నులు హైదరాబాద్ లోనే ఖర్చుపెడుతున్నారా?, రాజీనామా ఎవరు చేయాలో ప్రజలే డిసైడ్ చేస్తారు - నిర్మలా సీతారామన్