Revanth Reddy : పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సేవలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గుర్తుంచుకున్నారని, అందుకే ఆయన కుమార్తె స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా ఎంపిక చేశారని టీపీసీసీఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని పార్టీల కంటే ముందు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిందన్నారు. అభ్యర్థులను ప్రకటించుకోలేని స్థితిలో టీఆర్ఎస్, బీజేపీలు ఉన్నాయన్నారు. భయంతోనే ఆ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడానికి వెనకాడుతున్నాయని విమర్శించారు. నియోజకవర్గంలో మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నారాయణ పూర్ మండల బాధ్యతలు తాను తీసుకుంటానన్నారు. ముఖ్య నాయకులందరినీ నియోజకవర్గంలో ప్రచారానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించామన్నారు.
నిరుద్యోగులక చావుకు టీఆర్ఎస్ కారణం
"రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకెళతాం. సెప్టెంబర్ 18 నుంచి ప్రణాళిక బద్దంగా ప్రచారం నిర్వహిస్తాం. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. గుజరాత్ కు బులెట్ ట్రైన్ ఇచ్చుకున్నారు కానీ హైదరాబాద్ కు ఇవ్వలేదు. బీజేపీకి ఓటు అడిగే హక్కులేదు. టీఆర్ఎస్ పార్టీని ఉరివేసిన తప్పులేదు. గిరిజనుల భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది. నిరుద్యోగుల చావుకు టీఆర్ఎస్ కారణం. రాష్ట్రం శవాల కుప్పలుగా మారడానికి కేసీఆర్ఎస్ కారణం"- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
టీఆర్ఎస్, బీజేపీ డ్రామా
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఒక్క దెబ్బకు ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. కమ్యూనిస్టులు ఆత్మ ప్రభోదానుసారం కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. టికెట్ ఆశించిన కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ లకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం నిర్వహిస్తున్న శాఖలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను ఇప్పటి వరకు కేసీఆర్ కలవడం, బీజేపీని బలహీనపరచడం కాదని యూపీఎ భాగస్వాములను చీల్చి పరోక్షంగా బీజేపీకి బలం చేకూరుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ చంద్రమండలంలో కూడా పార్టీ పెట్టుకోవచ్చన్నారు. కేసీఆర్ పక్కనున్న సీఎం జగన్ ను కూడా కలవలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రద్దయిన వెయ్యి రూపాయల నోటు లాంటివారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మోసం చేయడానికే టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా అని రేవంత్ ఆరోపించారు.
లిక్కర్ స్కాంపై బుద్దిలేని ప్రచారం
లిక్కర్ స్కాం పై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోంది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు పదేపదే ఈ అంశంపై మాట్లాడుతున్నారు. సూదిని సృజన్ ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారో విచారణ చేయండి. ఆయనకు ఎవరితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో తీయండి. ఎప్పుడైనా,ఎక్కడైనా, ఏ విచారణకైనా నేను సిద్ధమే. దిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ఇల్లు ఇప్పటి వరకు సోదా చేయలేదు.-రేవంత్
Also Read : Munugodu Bypoll: మునుగోడులో కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా ! కోమటిరెడ్డి బ్రదర్స్ వార్ తప్పదా !
Also Read : Munugode TRS Candidate : మునుగోడుపై తేల్చుకోలేకపోతున్న కేసీఆర్ - అభ్యర్థిత్వం ఎవరికో ?