IRCTC Tourist Package : కొత్త ప్రదేశాలను ఎక్స్ ప్లోర్ చేయాలని, ట్రావెలింగ్ చేసేందుకు ఇష్టపడేవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్  ఐఆర్సీటీసీ టూరిస్ట్ ప్యాకేజీ ప్రకటించింది. ఆగస్ట్ 12వ తేదీ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతోంది. ట్రెజర్ ఆఫ్ థాయ్ లాండ్ పేరుతో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. మూడు రాత్రుళ్లు, 4 రోజుల పాటు ఉన్న టూర్ ప్యాకేజీలో పర్యాటకులను థాయ్ లాండ్ తీసుకెళ్లి అక్కడి ప్రదేశాలను చూపిస్తారు. థాయ్ లాండ్ లోని బ్యాంకాక్, పట్టాయా టూరిస్ట్ ప్రదేశాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. 


ట్రెజర్స్ ఆఫ్ థాయ్ లాండ్ టూర్ 


ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌ లాండ్ టూర్ లో మొదటి రోజు హైదరాబాద్‌లో అర్థరాత్రి గం.1.10 లకు ఫ్లైట్ బయలుదేరుతుంది. ఫ్లైట్ తెల్లవారుజామున గం.6.15 లకు బ్యాంకాక్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ముందుగా పట్టాయా తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ చేసి మధ్యాహ్నం వరకు రెస్ట్ ఉంటుంది.  మధ్యాహ్నం లంచ్ తర్వాత పట్టాయాలోని జెమ్స్ గ్యాలరీ సందర్శన ఉంటుంది. సాయంత్రం అల్కజార్ షో చూడవచ్చు. నైట్ ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ ఉంటుంది. పట్టాయాలోనే రాత్రి బస ఉంటుంది. రెండో రోజు మార్నింగ్ కోరల్ ఐల్యాండ్ సందర్శనకు బయలుదేరాలి. అక్కడ నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్ టూర్ ఉంటుంది.  రెండో రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ తర్వాత పట్టాయాలోనే బస చేయాలి.


నాల్గో రోజు బ్యాంకాక్ లో టూర్ 


మూడో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్ వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం భోజనం తర్వాత  గోల్డెన్ బుద్ధ టెంపుల్, ఇతర టూరిస్ట్ ప్రదేశాల సందర్శన ఉంటుంది. రాత్రి బస బ్యాంకాక్ లోని చేయాలి. నాల్గో రోజు హోటల్ నుంచి చెకౌట్ తర్వాత సఫారీ వాల్డ్ టూర్, మెరైన్ పార్క్ సందర్శన ఉంటుంది. నాల్గో రోజు రాత్రి 10.10 గంటలకు బ్యాంకాక్‌లో ఫ్లైట్ బయలుదేరుతోంది. అర్ధరాత్రి 12.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది. 


టూర్ ప్యాకేజీ వివరాలు 


ఐఆర్సీటీసీ ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ ధరలను ప్రకటించింది. సింగిల్ షేరింగ్‌కు రూ.55,640, డబుల్ షేరింగ్‌కు రూ.48,820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.48,820 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఐఆర్సీటీసీ టూరిజం వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో సెర్చ్ చేయవచ్చు.


Also Read : KCR News: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రత్యేకతలు ఏంటంటే