హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు ఇంకా కొనసాగుతోంది. ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసింది దక్షిణమధ్య రైల్వే. తాజాగా ఇవాళ కూడా 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 18, ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య నడిచే 16 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి.
నగరవాసులు ఎంతో మంది ఎంఎంటీఎస్ ద్వారా ప్రయాణిస్తుంటారు. అయితే సేవల్లో అంతరాయం తాత్కాలికమని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ఒక్క రోజు మాత్రమే సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మత్తులు కారణంగా 36 సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంఎంటీఎస్ సేవలతో పాటు విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
- లింగపల్లి-హైదరాబాద్ రూట్ లో మొత్తం 9 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 సర్వీసులను రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు
- హైదరాబాద్-లింగపల్లి మార్గంలో 9 సర్వీసులు రద్దయ్యాయి. 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేశారు.
- ఫలక్ నుమా-లింగంపల్లి రూట్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు అయ్యాయి. 47153, 47164, 47165, 47216, 47166, 47203, 47220, 47170 సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు
- లింగంపల్లి-ఫలక్ నుమా మార్గంలో 8 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు అయ్యాయి. 47176, 47189, 47186, 47210, 47187, 47190, 47191, 47192 సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
- సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 47150 సర్వీసు రద్దు చేశారు. లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో 47195 ఎంఎంటీఎస్ సర్వీసు రద్దు అయ్యింది.
- విశాఖపట్నం-ఎన్.నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్(12803) కూడా ఈ నెల 24న రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.
Also Read: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన