హైదరాబాద్ నానక్ రామ్ గూడలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నానక్ రామ్ గూడలోని ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలి 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మూడంతస్తుల భవనంలో బిహార్ కు చెందిన దాదాపు 50 మంది కార్మికులు నివసిస్తున్నారు. ఒక్కో ఫ్లోర్‌లో రెండు గదులు ఉండగా, ఒక్కో గదిలో 6 నుంచి 10 మంది వరకు నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో పేలిన గ్యాస్ సిలిండర్ వాణిజ్య సిలిండర్ అని అధికారులు తెలిపారు. ఇంటిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఎందుకు ఉపయోగిస్తున్నారో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటలకు పేలుడు సంభవించిందని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 


Also Read:  తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 


ఒకే సిలిండర్ కు మూడు కనెక్షన్లు


హైదరాబాద్ నానాక్‌రామ్‌గూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మొత్తం 11 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ఒక గ్యాస్ సిలిండర్ కు మూడు కనెక్షన్స్ ఇవ్వటం వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. గ్యాస్ ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్‌ లీకేజీ అయిందని మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో లైట్స్ ఆన్ చేయడం వల్ల భారీ పేలుడు సంభవించిందని తెలుస్తోంది.


Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..


ప్రమాద సమయంలో బిల్డింగ్ లో 50 మంది కార్మికులు


ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారంతా బిహార్‌ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వీరంతా హైదరాబాద్ వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో సుమారు 50 మంది కార్మికులు ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.


Also Read: తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఈడీ దూకుడు.. రూ. 144 కోట్ల ఆస్తుల జప్తు !


Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..


Also Read: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి