హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మెట్రో సమయాల్లో హెచ్ఎంఆర్ మార్పు చేసింది. ఇకపై ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(HMRL) ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 10 నుంచి ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుందని తెలిపింది. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుందని పేర్కొంది. మెట్రో సేవలు పొడిగించాలని మంత్రి కేటీఆర్(KTR)ను ఓ ప్రయాణికుడు కోరాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మెట్రో ఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో మెట్రో వేళ్లలో మార్పులు చేశారు.
Also Read: ఎదురొచ్చిన ఎన్నికల కోడ్.. కేసీఆర్ వరంగల్ టూర్ వాయిదా.. విజయగర్జన సభ కూడా !
నెటిజన్ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్
అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ఉదయం వేళ మెట్రో రైలు ఫ్లాట్‌ఫామ్‌ల వద్ద రద్దీని వీడియో తీశాడు. రైళ్ల కోసం ఎదురు చూస్తున్న జనం రద్దీ, వృద్ధులు, మహిళలు పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో సోమవారం ట్యాగ్ చేశారు. తెల్లవారుజామున నగరానికి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు సరిగాలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఉదయం 6 నుంచే మెట్రోరైళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని కేటీఆర్ ను కోరారు. ఈ ట్వీట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్.. అభినవ్ మాటలతో ఏకీభవిస్తున్నట్టు రీట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో ఎండీ(Metro MD)కి మంత్రి కేటీఆర్ టాగ్ చేశారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనిపై మెట్రో ఎండీ సానుకూలంగా స్పందించారు. దీంతో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న నగరవాసుల కల నెరవేరింది.
Also Read: ‘భయ్యా తోడా పియాజ్ డాలో’ అంది.. లేవని చెప్పడంతో ఎంత పని చేసిందో చూడండి
ప్రయాణికుల రద్దీ
హైదరాబాద్ కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల మంది నిత్యం ప్రయాణం చేస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు హైదరాబాద్ కు తెల్లవారుజామున చేరుతాయి. దీంతో ఉదయం ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడి గమ్యానికి చేరుకుంటారు. నగరంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10:15 గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్(Secunderabad) వచ్చే ప్రయాణికులు, ఉద్యోగులు ఉదయం 7 గంటల కన్నా ముందే మెట్రో స్టేషన్‌లకు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
Also Read: కొత్త మద్యం దుకాణాల షెడ్యూల్ విడుదల... స్థానికులకే లిక్కర్ షాపులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి