హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వీరిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇరుపార్టీల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో వెంటపడటంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ నుంచి పరుగులు తీశారు. 


Also Read: Revanth Reddy: ‘కేటీఆర్ నువ్వు నన్ను ఏం చేయలేవు.. డ్రగ్స్ అంటే ఎందుకంత ఉలిక్కిపడతవ్’ రేవంత్ హాట్ కామెంట్స్


 కేటీఆర్ పరువునష్టం దావా 


తెలంగాణలో వైట్ ఛాలెంజ్ రాజకీయ రగడకు దారితీస్తోంది. వైట్ ఛాలెంజ్ కాస్త కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా మారింది. రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌ల మధ్య ట్విటర్ వేదికగా వార్ నడిచింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. కేటీఆర్‌ మాదక ద్రవ్యాలు వాడలేదని, పరీక్షలు చేయించుకోవాలని రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్‌ను విసిరారు. రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయనపై కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ఆయన నివాసం వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు టీర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.


 






Also Read: White Challenge : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?


కేటీఆర్, కొండాకు వైట్ ఛాలెంజ్   
 
 వైట్‌ ఛాలెంజ్‌ పేరుతో మంత్రి కేటీఆర్​కు రేవంత్ రెడ్డి సవాల్‌ విసిరారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేని కేటీఆర్​పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు్న్నారు. తెలంగాణలో వైట్ ఛాలెంజ్ హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసిరారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు వైట్ ఛాలెంజ్ విసిరారు. డ్రగ్స్ వాడకూడ‌దని ప్రజ‌ల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రజా ప్రతినిధులు ముందుగా టెస్టులు చేయించుకోవాలని రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. 


Also Read: Telangana White Challenge: తెలంగాణలో వైట్ ఛాలెంజ్ రగడ... కొండా ఛాలెంజ్ కు బండి సంజయ్ ఓకే.. రేవంత్ రెడ్డి సవాల్ కు కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి