IND VS AUS Tickets :  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో హైకోర్టు న్యాయవాది సలీం ఫిర్యాదు చేశారు. ఈ నెల 25న ఉప్పల్ లో జరగనున్న ఇండియా- ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాలపై అవకతవకలు జరిగాయని హెచ్ఆర్సీలో న్యాయవాది సలీం ఫిర్యాదు చేశారు. క్రీడా అభిమానులను మోసం చేస్తూ  అక్రమంగా టికెట్లను బ్లాక్ లో హెచ్.సీ.ఏ విక్రయిస్తుందని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి , టికెట్ల విక్రయ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరారు. రెండేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం ఈనెల 20 నుంచి భారత్ లో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ పర్యటిస్తుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 25న మూడో టీ 20లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.  


భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్ లు 


టీ20 ప్రపంచకప్ నకు ఇంకా 4 వారాల సమయమే ఉంది. ఈలోపు భారత్.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పొట్టి సిరీస్ లు ఆడనుంది. ఈ సిరీస్ లను మెగా టోర్నీకి సన్నాహకంగా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు కూర్పుపై ఒక అంచనాకు రావచ్చు. అలాగే బ్యాటింగ్, బౌలింగ్ లలో ఉన్న సమస్యలను సరిచేసుకునే అవకాశమూ ఉంది. నేచి నుంచి ఆసీస్ తో సిరీస్ మొదలవబోతోంది. సెప్టెంబర్ 20 (మంగళవారం) నుంచి ఆసీస్ తో టీ20 సిరీస్ మొదలుకానుంది. బ్యాటింగ్ లో రోహిత్, రాహుల్ లు భారీ ఇన్నింగ్సులు ఆడాల్సిన అవసరముంది. కోహ్లీ ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చాడు. సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యాలు పెద్ద ఇన్నింగ్సులు ఆడాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే స్టార్ పేసర్ బుమ్రా జట్టుతో చేరడం పెద్ద బలం. అతనితోపాటు హర్షల్ పటేల్ అందుబాటులో ఉన్నాడు. భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ లతో పేస్ దళం బలంగానే కనిపిస్తోంది. అక్షర్ పటేల్, యుజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్ లు స్పిన్ భారం మోయనున్నారు. 


టీ20 షెడ్యూల్ ఇలా 



  • మొదటి టీ20  -   సెప్టెంబర్ 20 (మంగళవారం)         మొహాలీ             రాత్రి 7.30 గం.లకు

  • రెండో టీ 20     -   సెప్టెంబర్ 23 (శుక్రవారం)               నాగ్ పూర్           రాత్రి 7.30 గం.లకు

  • మూడో టీ20    -   సెప్టెంబర్ 25  (ఆదివారం)             హైదరాబాద్        రాత్రి 7.30 గం.లకు


ఈ మ్యాచులు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్లలో వీక్షించవచ్చు. ఇప్పటివరకు భారత్- ఆస్ట్రేలియా జట్లు టీ20ల్లో 22 సార్లు తలపడ్డాయి. భారత్ 13 విజయాలు సాధించగా.. ఆసీస్ తొమ్మిందింట్లో నెగ్గింది. 


భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, దీపక్ చాహర్.


ఆస్ట్రేలియా జట్టు


ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్ వుడ్, జోష్ ఇగ్లిస్, గ్లెన్ మాక్స్ వెల్, కేన్ రిచర్డ్ సన్, డానియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, అడమ్ జంపా, మాథ్యూ వేడ్. 


Also Read : IND vs AUS T20: అతడితో ఆడాలంటే పక్కా ప్రణాళిక ఉండాల్సిందే: ఆస్ట్రేలియా కెప్టెన్


Also Read : KL Rahul: ఎవరూ పర్ ఫెక్ట్ కాదంటున్న కేఎల్‌ రాహుల్