హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, సైదాబాద్, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేటలో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో రాత్రి 9 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది.
Also Read: ఇండస్ట్రీకి నా మీద కాన్ఫిడెన్స్ పోయింది.. దేవకట్టా కామెంట్స్!
రంగంలోకి అత్యవసర బృందాలు
సాయం కోసం 040-29555500 కు సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అంబర్‌పేటలో భారీ వర్షం కారణంగా ముసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా మూసీ వరదనీరు ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై వాహన రాకపోకలు నిలిపివేశారు. వందలాది వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి.
Also Read: క్షమాపణ చెప్పిన జగ్గారెడ్డి - టీ కాంగ్రెస్‌లో సద్దుమణిగిన వివాదం
రాగల మూడు రోజులు వర్షాలు
ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 470 కి.మీ. దూరంలో తూర్పు - ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి 540 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్యలోని కళింగపట్నం వద్ద ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండిం