ABP  WhatsApp

CM KCR : సంస్కార‌వంత‌మైన పోలీసు వ్యవ‌స్థ నిర్మాణం కావాలి -సీఎం కేసీఆర్

ABP Desam Updated at: 04 Aug 2022 04:03 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

CM KCR : పోలీసు వ్యవస్థకు కమాండ్ కంట్రోల్ సెంటర్ మూలస్తంభం లాంటిందని సీఎం కేసీఆర్ అన్నారు. సీసీసీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని తెలిపారు.

సీఎం కేసీఆర్

NEXT PREV

CM KCR : హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ను సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. పోలీస్ వ్యవస్థకు కమాండ్ కంట్రోల్ సెంటర్ మూలస్తంభం లాంటిందన్నారు. డీజీపీ మహేంద్రరెడ్డి ఈ సెంటర్ కు రూపకర్త అని కేసీఆర్ అన్నారు. సీసీసీని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినట్లు తెలిపారు. 


పోలీసులందరికీ సెల్యూట్ 


"పోలీసు వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉంటే పౌర సమాజం అంత భరోసాగా ఉంటుంది. పోలీసు అధికారులందరికీ నా సెల్యూట్. ప్రభుత్వపరంగా పోలీసు వ్యవస్థకు అన్ని విధాలుగా సహకరిస్తాం. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ రావాలనేది నా కోరిక. వీటితో పాటు సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కావాలి. సైబర్ క్రైమ్స్ ప్రపంచానికి సవాల్ మారాయి. వీటిని అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ కృషి చేయాలని కోరుతున్నాను. దేశంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేస్తుందన్నారు." -సీఎం కేసీఆర్ 


సాధ్యం కానిది ఏదీ లేదు 



కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. చేయదుల్చుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఆర్టీసీని నేను మంత్రిగా ఉన్నప్పుడు నష్టాల నుంచి లాభాల్లోకి తెచ్చాము. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి. హైదరాబాద్ లో నేరాలు చాలా వరకు తగ్గాయి.  ఇంకా నేరస్థులు కొత్త పద్ధతిలో నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించాలి. భారతదేశ పోలీసు వ్యవస్థకే తెలంగాణ ఆదర్శం కావాలి. పేకాట వంటి జూదాలను నిర్ములించగలిగాం. - - సీఎం కేసీఆర్ 


అద్భుత ఫలితాలు సాధించాలి 


హైద‌రాబాద్ లో పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నెల‌కొల్పడం ప్రభుత్వ సంక‌ల్ప బ‌లానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన‌ప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవ‌స్థ రావాల‌ని చెప్పేవాడినని, అది నెరవేరిందన్నారు. ఇప్పుడు సంస్కార‌వంత‌మైన పోలీసు వ్యవ‌స్థ నిర్మాణం కావాలని కోరిక ఉందన్నారు. ఎంత చ‌దువుకున్నా సంస్కారం లేక‌పోతే క‌ష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో ఇంత మంచి క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ వస్తుందని ఎవ‌రూ ఊహించి ఉండ‌రన్నారు. ప్రభుత్వ సంక‌ల్పంతో దీన్ని నిర్మించామన్నారు. రాష్ట్రంలో గుడుంబా నిర్మూలన కోసం అనేక చ‌ర్యలు తీసుకున్నామన్నారు. పేకాట క్లబ్బుల‌ను మూసివేశామన్నారు. రాబోయే రోజుల్లో పోలీసులు మ‌రింత చురుకుగా ప‌నిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. మంచి సాధించ‌డానికి సంక‌ల్పంతో ప‌నిచేస్తే స‌త్ఫలితాలు వ‌స్తాయ‌న్నారు. తెలంగాణ పోలీసు శాఖ అద్భుత ఫ‌లితాలు సాధించాలని సీఎం కేసీఆర్ అభిలాషించారు. ప్రజ‌ల‌కు సేవ అందించే సంస్థలా పోలీసు వ్యవస్థ మారిందన్నారు. సంస్కార‌వంత‌మైన పోలీసుగా త‌యారు కావాలన్నారు. 

Published at: 04 Aug 2022 03:53 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.