ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్ పేర్కొన్న మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సహా ఎనిమిది మందికి  నోటీసులు జారీ చేసింది.   ఈ వ్వవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేంచింది.  విచారణను ఏప్రిల్‌ 29వ తేదీకి వాయిదా వేసింది. పోలీసుల వేధింపుల తాళలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసును సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని కోరారు. అయితే..  సాయి గణేష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్  29 కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.


తెలంగాణలో కరోనా ఫోర్త్ వేవ్ పై డీహెచ్ కీలక వ్యాఖ్యలు, మాస్క్ ధరించకపోతే రూ. వెయ్యి ఫైన్


నాలుగు రోజుల కిందట ఖమ్మంలో (khammam)  బీజేపీ కార్యకర్త సాయి గణేష్ (sai ganesh) పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ కారణమని బీజేపీ (bjp) నాయకులు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ప్రసన్న కృష్ణ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేకే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని అతని అమ్మమ్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. 


ఖమ్మంపై కాంగ్రెస్‌ కన్ను, నేతల వరుస పర్యటనలతో జిల్లాలో జోష్ - ఆ హోదాలో రేవంత్‌ తొలిసారిగా


 ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా.. సాయి గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా భదాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేయలేదని విమర్శించారు.   ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ ముఖ్యులు కూడా సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించి.. మంత్రి పువ్వాడపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.